Breaking News

ఆటోనగర్‌లోకి భారీ వాహనాల రాకపోకల సమస్యకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చొరవతో పరిష్కారం

-ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కార్యాలయంలో ఆటోనగర్‌ ప్రతినిధులు, పోలీసుల మధ్య జరిగిన చర్చలు సఫలం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహానాడు రోడ్డు జంక్షన్‌ నుంచి ఆటోనగర్‌లోకి లారీలు, భారీ వాహనాల రాకపోకలపై పోలీసులు విధించిన ఆంక్షలను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చొరవతో పరిష్కారం అయ్యింది. ట్రాఫిక్‌ పోలీసులు విధించిన ఆంక్షలపై ది విజయవాడ నోటిఫైడ్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియాస్‌ సర్వీస్‌ సొసైటీ ఛైర్మన్‌ సుంకర దుర్గాప్రసాద్‌తో పాటుగా ఆటోనగర్‌లోని వివిధ సంఘాల సభ్యులు, ట్రాఫిక్‌ ఏడీసీపీ ప్రసన్నకుమార్, ట్రాఫిక్‌ సీఐలు రామారావు, కిషోర్, రమేష్‌లతో కలిసి అశోక్‌నగర్‌లోని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కార్యాలయంలో మంగళవారం చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో ఆటోనగర్‌లోని అసోసియేషన్‌ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపి పోలీసులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌కు వారంతా కృతజ్ఞతలు తెలిపారు.
చర్చల అనంతరం ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ మహానాడు రోడ్డు జంక్షన్‌ నుంచి లారీలు, భారీ వాహనాలను జవహర్‌ ఆటోనగర్‌లోనికి 24 గంటలు ప్రవేశానికి అనుమతి ఉందన్నారు. స్కూల్స్, కళాశాలలు, ఉద్యోగాలకు వెళ్ళివచ్చే వారి వలన ట్రాఫిక్‌ ఎక్కువుగా ఉండే సమయంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు లారీలు, భారీ వాహానాలు బయటకు వెళ్ళుటకు అనుమతులు లేవన్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు లారీలు భారీ వాహనాలు బయటకు వెళ్ళుటకు ట్రాఫిక్‌ పోలీసులు అనుమతులు ఇచ్చారని చెప్పారు. నగరంలోని ట్రాఫిక్‌ నియంత్రణ దృష్ట్యా ట్రాఫిక్‌ పోలీసు శాఖ ఆటోనగర్‌లోకి లారీలు, భారీ వాహనాలు రాకపోకల కోసం సడలించిన వేళలను లారీ యజమానులకు, డ్రైవర్లకు, ఆటోనగర్‌లోని అన్ని అసోసియేషన్ల ప్రతినిధులకు తెలియజేసిన నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసులతో సహకరించాల్సిందిగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు.

ప్రత్యామ్మాయ రోడ్ల అభివృద్థిపై దృష్టి
–ఆటోనగర్‌లోకి భారీ వాహనాలు, లారీలు రాకపోకలు సాగించడానికి అనువుగా ఉండే ప్రత్యామ్మాయ రోడ్లను అభివృద్థికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. రోడ్ల అభివృద్ధి గురించి పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొడే ప్రసాద్, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సీఆర్‌డీఏ కమిషనర్‌తో చర్చించి ఆటోనగర్‌ 1వ క్రాస్‌ రోడ్డు నుంచి కానూరు 100 అడుగుల రోడ్డు వరకు, మహానాడు రోడ్డు నుంచి కానురు 100 అడుగుల రోడ్డు వరకు, టంకశాల కళ్యాణమండపం దగ్గర నుంచి బల్లెం వారి వీధి, కానూరు కొత్త ఆటోనగర్‌ను కలుపుకుంటూ కానూరు 100 అడుగుల రోడ్డు వరకు అనుసంధాన రోడ్లను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు.
ది విజయవాడ నోటిఫైడ్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియాస్‌ సర్వీస్‌ సొసైటీ సెక్రటరీ అన్నే శివనాగేవ్వరరావు, ఆటో ఎలక్ట్రీకల్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అబ్ధుల్‌ కలాం, కార్యదర్శి బాబూబలేంద్రగూడెపు కోటేశ్వరరావు, పెయింటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీరాచారి, కార్యదర్శి ఖాజా, బ్లాక్‌స్మిత్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వాడపల్లి శ్రీరాములు, హెచ్‌ఎంసీ ఆటో ఓనర్స్‌ అండ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ భాషా, కార్పోరేటర్లు ముమ్మనేని ప్రసాద్, పేరేపి ఈశ్వర్‌ ఈ చర్చల్లో పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *