తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో గూడూరు లోని డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాల(DRW Degree College,Gudur) నందు 29-11- 2024 అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును.
జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: DRW Degree College, Gudur, Tirupati Dist.
ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన అల్ట్రా మెరైన్ పిగ్మెంట్స్ ,ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్, డైకిన్ ఎయిర్ కండిషనర్ కంపెనీ మొదలగు కంపెనీలలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును.
విద్యార్హతలు: పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్త అయిన యువతీ యువకులు అర్హులు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు ఆధార్ కార్డు జిరాక్స్ మరియు విద్యార్హత సంబందించిన సర్టిఫికెట్స్ జిరాక్స్ మరియు బయోడేటా ఫామ్ తో పాటు క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా నమోదు చేసుకొని కచ్చితంగా అడ్మిట్ కార్డు తో జాబ్ మేళాకు హాజరవ్వవలెను అని ఆర్ లోకనాథం గారు, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి, తిరుపతి జిల్లా ఒక ప్రకటనలో తెలియజేశారు.
రిజిస్ట్రేషన్ లింకు: https://naipunyam.ap.gov.in/
మరిన్ని వివరములకు 8639835953 మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు.