Breaking News

ఎమ్ టి ఎఫ్ (MTF) స్టూడెంట్ బ్యాంకు ఖాతాలకు నేరుగా ప్రభుత్వం వారు త్వరలో విడుదల

-పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ లకు సంబంధించిన ఆర్టీఎఫ్ (RTF) నిధులను కళాశాలల యాజమాన్యాలకు మరియు ఎమ్ టి ఎఫ్ (MTF) స్టూడెంట్ బ్యాంకు ఖాతాలకు నేరుగా ప్రభుత్వం వారు త్వరలో విడుదల చేయనున్నారు
-కాలేజీ యాజమాన్యాలు వారి వద్ద చదువుకుంటున్న విద్యార్థులను పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్లకు సంబంధించిన బకాయుల కొరకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ లకు సంబంధించిన ఆర్టీఎఫ్ (RTF) నిధులను కళాశాలల యాజమాన్యాలకు మరియు ఎమ్ టి ఎఫ్ (MTF) స్టూడెంట్ బ్యాంకు ఖాతాలకు నేరుగా ప్రభుత్వం వారు త్వరలో విడుదల చేయనున్నారని, కాలేజీ యాజమాన్యాలు వారి వద్ద చదువుకుంటున్న విద్యార్థులను సదరు స్కాలర్షిప్లకు సంబంధించిన బకాయుల కొరకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హెచ్చరించారు.

గత ప్రభుత్వంలో తల్లుల ఖాతాల్లో సదరు ఫీజు రీయింబర్స్మెంట్ నగదు జమచేసే వారనీ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను 2024 – 25 విద్యా సంవత్సరం నుండి కళాశాలల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేసే పాతవిధానాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు నిధులను ఈ బడ్జెట్ నందు కేటాయించడం జరిగిందనీ తెలిపారు. కాలేజీ యాజమాన్యాలు వారి వద్ద చదువుకుంటున్న విద్యార్థులను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు సంబంధించిన బకాయుల కొరకు వారి సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను ఇవ్వకుండా, పరీక్షలకు హాల్ టిక్కెట్లు జారీ చేయకుండా, ప్రాక్టికల్స్ పరీక్షలకు అనుమతించకుండా ఇబ్బంది పెట్టడం,వారిని పరీక్షలు రాయనీయకుండా చేయడం, లేక వారిని వివిధ రకాలుగా మానసిక ఆందోళనకు, భయాందోళనకు గురి చేయరాదని మరియు పరీక్షల సమయంలో విద్యార్థులు చదువుపై దృష్టి సారించేల కళాశాల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే నిబంధనల మేరకు చట్ట ప్రకారం చర్యలు తప్పకుండా తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిస్తూ అన్ని కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *