-నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలి
-2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎంఈజిపి లక్ష్యాల మేరకు మంజూరు, గ్రౌండింగ్ కు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి) సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఉపాధి కార్యక్రమం (పి.ఎం.ఈ.జి.పి.) సమీక్షిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను లబ్దిదారుల నుండి అందిన దరఖాస్తులను పరిశీలిస్తే 710 దరఖాస్తులకు గాను 279 యూనిట్లు మంజూరు చేయగా 331 గ్రౌండింగ్ అయ్యాయని అధికారులు తెలుపగా మిగిలిన వాటి మంజూరు కొరకు త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హత మేరకు సత్వరమే యూనిట్లు మంజూరు, పెండింగ్ దరఖాస్తుల గ్రౌండింగ్ చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించబడిన లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని సూచించారు. MSME సర్వే నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఎల్డిఎం, పీడీ, డిఆర్డిఎ మరియు పీడీ, మెప్మాలతో సమన్వయము చేసుకొని లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
సింగిల్ డెస్క్ విధానంలో ఏప్రిల్ 2024 నుండి నవంబర్ 23 నాటికి 1773 పరిశ్రమలకు గాను 1731అనుమతులు ఇచ్చామని మరో 32 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. పెట్టుబడి సబ్సిడీ 2, విద్యుత్ సబ్సిడీ 14, వడ్డీ రాయితీ 14, సేల్స్ టాక్స్ మినహాయింపు 4, స్టాంప్ డ్యూటీ 1 యూనిట్లకు కమిటీ ఆమోదించారు. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్, తిరుపతి, చీరలు & ఇతర బహుళ ఉత్పత్తుల క్లస్టర్ రూపకల్పన మరియు నేయడం, నారాయణవనం
ఏర్పాటుకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించి వేగవంతం చేయాలని అన్నారు.
జిల్లా స్థాయి కమిటీని PD, DRDA, GM, DIC, జాయింట్ కమీషనర్, రాష్ట్ర పన్ను శాఖ, రీజనల్ మేనేజర్, APSRTC, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా ఉద్యానవన అధికారి,జిల్లా మత్స్య అధికారి,జిల్లా చేనేత & జౌళి అధికారి సభ్యులతో జిల్లా స్థాయి అమలు కమిటీని ఏర్పాటుకు సూచించారు. ONDCకి జిల్లా నోడల్ అధికారిగా GM, DIC ఉంటారన్నారని తెలిపారు
జిల్లాలో పరిశ్రమలు భద్రత ప్రమాణాలు అమలు చేయాలని, ప్రమాదాల నివారణకు తరచూ సంబందిత అధికారులు సేఫ్టీ మెజర్మెంట్ పై అవగాహన కల్పించి తప్పని సరిగా నిబంధనల మేరకు అమలు జరిగేలా చూడాలని ఆదేశించగా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వివరిస్తూ పలు పరిశ్రమలకు నోటీస్ లు ఇచ్చామని, భద్రత ప్రమాణాలు మెరుగు కొరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పరిశ్రమలకు సంబందించిన అనుమతులు వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఏపిఐఐసి ద్వారా భూమి కేటాయించబడిన పరిశ్రమలు వివిధ దశలలో వున్నవి, ఇంకా ప్రారంభించని వాటిని త్వరిత గతిన ప్రారంభించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి పరిశ్రమల శాఖ అధికారి మారుతి ప్రసాద్, జోనల్ మేనేజర్ ఏపిఐఐసి తిరుపతి చంద్రశేఖర్, జోనల్ మేనేజర్ తిరుపతి స్పెషల్ ప్రాజెక్ట్ జోన్ వీర శేఖర్ రెడ్డి, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ రామకృష్ణ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య తదితర అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.