Breaking News

కామినేని అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో కేర్ నందు అందుబాటులో అధునాతన వైద్య సేవలు…

-పలు క్లిష్టమైన కేసుల్లో విజయవంతంగా చికిత్సలు
-అత్యాధునిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో మెరుగైన ఫలితాలు
-మీడియా సమావేశంలో కామినేని సీవోవో డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని కామినేని హాస్పిటల్స్ గ్యాస్ట్రో విభాగంలో అధునాతన సేవలు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన నిపుణుల ఆధ్వర్యంలో స్కానింగ్ తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులతో చికిత్స, శస్త్రచికిత్స, ఎండోస్కోపీ తదితర సేవలను అందిస్తున్నారు. కామినేని గ్యాస్ట్రో విభాగంలో ఇటీవల కొన్ని క్రిటికల్ కేసుల్లో విజయవంతంగా చికిత్సనందించి, పేషేంట్ల ప్రాణాలను కాపాడగలిగారు. కామినేని అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో కేర్ నందు నిర్వహించిన చికిత్సలను సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. నగరంలోని ఇంద్రప్రస్థ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో కామినేని సీవోవో డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ల మాట్లాడుతూ తమ హాస్పిటలోని అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో కేర్ విభాగం నందు సీనియర్ గ్యాస్ట్రో సర్జన్లు డాక్టర్ గొర్తి గణేష్, డాక్టర్ పవన్ వెలినేని సేవలందిస్తున్నారని అన్నారు. కామినేని అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో కేర్ నందు ఇటీవల నిర్వహించిన చికిత్సల గురించి వివరిస్తూ.. “ఇటీవల గత నెల ఎనిమిదో తేదీన గుంటూరుకు చెందిన 28 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన జ్వరం, విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతూ పలు హాస్పిటళ్లకు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో, అతి క్లిష్టమైన పరిస్థితిలో కామినేని అత్యవసర విభాగంలో చేరాడు. సర్జికల్ గ్యాస్ట్రో నిపుణులు డాక్టర్ పవన్ వెలినేని పర్యవేక్షణలో రోగికి పలు పరీక్షలు నిర్వహించి క్లోమగ్రంథి కుళ్లినట్లుగా నిర్ధారించారు. రోగికి క్లోమగ్రంథి వద్ద ప్రేగుకు రంధ్రం ఏర్పడటంతో పొట్టలో మలం లీకవుతున్నట్లుగా గుర్తించారు. రోగికి లాపరోస్కోపీ పద్ధతిలో ఆపరేషన్ చేసి పేగును వెలుపలికి పెట్టారు. కోలుకుంటున్న సమయంలో కడుపునొప్పితో పాటు రక్త విరేచనాలు కావడంతో సీటీ ఏంజియో చేసి క్లోమగ్రంథి ఇన్ఫెక్షన్ కారణంగా దగ్గరలో ఉన్న రక్తనాళాలు ఉబ్బి పగులుతున్నట్లు గమనించారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సహాయంతో శస్త్రచికిత్స నిర్వహించి రక్తస్రావాన్ని అరికట్టి రోగి ప్రాణాలను కాపాడారు. శస్త్రచికిత్స చేసిన నాలుగురోజుల అనంతరం రోగి పూర్తి ఆరోగ్యవంతుడిగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో కేసులో 24 ఏళ్ల వ్యక్తి పసరు మందు తీసుకుని కాలేయం పూర్తిగా దెబ్బతినడంతో కోమాలోకి వెళ్లాడు. సదరు వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందుల ద్వారా కేవలం మూడు రోజుల్లో కోమా నుంచి బయటపడేలా చేయగలిగారు. పూర్తిగా కోలుకుని పది రోజుల్లో అతడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాడు. రోడ్డు ప్రమాదంలో ఉదరభాగానికి తీవ్రమైన దెబ్బతగిలిన 14 ఏళ్ల బాలుడు చికిత్స నిమిత్తం కామినేనిలో చేరాడు. కాలేయానికి గ్రేడ్ 5 గాయమైనట్లు గుర్తించిన వైద్యులు సకాలంలో స్పందించి, ఆపరేషన్ అవసరం లేకుండా కేవలం మందులతో నయం చేశారు” అని అన్నారు. కామినేనిలో అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో కేర్ నందు అందుబాటులో ఉన్న అధునాతన సదుపాయాల కారణంగా అద్భుత ఫలితాలు సాధించగలుగుతున్నామని డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ల తెలిపారు. సకాలంలో సమస్యను నిర్ధారించడం, బహుళ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ఒకేచోట అందుబాటులో ఉండటం వల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు సైతం విజయవంతంగా వైద్యసేవలను అందించగలిగామని ఆయన వెల్లడించారు. క్లోమగ్రంథి, ప్రేగు క్యాన్సర్లకు లాపరోస్కోపీ విధానంలో కోత లేకుండా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కాలేయం పూర్తిగా దెబ్బతినడంతో నోటి నుండి రక్తస్రావం అవుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా బ్యాండింగ్, పిత్తవాహికలో రాయి అడ్డుపడిన వారికి ఎండోస్కోపీ ద్వారా కోతలేకుండా రాళ్లను తొలగించడం, స్కానింగ్ ద్వారా ఎంబోలైజేషన్ తదితర సేవలు కామినేని అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో కేర్ నందు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ల తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో గాస్ట్రో సర్జన్లు డాక్టర్ గొర్తి గణేష్, డాక్టర్ పవన్ వెలినేని తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 947

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *