కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమం స్థానిక ఆఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ రాణి సుష్మిత మాట్లాడుతూ, భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆలోచనలు మరియు ఆలోచనలను వ్యాప్తి చేయడానికి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ఇందులో భాగంగా రాజ్యాంగ స్ఫూర్తిని నింపే ప్రతిజ్ఞను చేయడానికి ఈరోజును ఎంచుకున్నామన్నారు. తొలిదా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం సిబ్బంది ఇతర అధికారులు పాల్గొని చేయడం జరిగింది.
Tags kovvuru
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …