Breaking News

విజయనగరం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం


అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయనగరం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం సైనిక హిల్స్ హైట్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం, అధ్యక్షులు మోటూరి శంకర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోటూరిశంకర్రావు మాట్లాడుతూ, ఎంతో కాలం నుంచి మాజీ సైనికుల స్థలం సబ్ డివిజన్ జరగకపోవడం విచారకరం. అధికారులు మాజీ సైనిక సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, దేశం కోసం పోరాటం చేసిన సైనికుల సంక్షేమాన్ని పరిష్కరించాలని. సబ్ డివిజన్ చేయాలని కోరారు. అందరి కోసం నిర్మించిన సైనిక హిల్స్ కాలనీ ఆలోచన ఈ రాష్ట్రానికి ఒక ఉదాహరణ అని ఈ జిల్లాలో ఇక్కడ కాలనీకి 15 ఎకరాలు కేటాయించడం చాలా సంతోషకరం అలాగే దానిని వెంటనే సబ్ డివిజన్ చేస్తే, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు.విజయనగరం జిల్లా లోని మాజీసైనికులు ఏ పి స్టేట్ ఎక్సెర్విసెమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ లో అనేకమంది సభ్యులుగా చేరటం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు విజయనగరం జిల్లా వితంతువులు, తదితరులు పాల్గొంటూ, సబ్ డివిజన్ పెండింగ్ ఉంచడము బాధపడుతున్నామని, 351 మంది లబ్ధిదారులుపట్టాలు తీసుకుని ,నిర్మాణాలు చేపట్టుటకు సిద్ధంగా ఉన్నారని, సబ్ డివిజన్ అయితే గాని, తమకు లోన్ బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇంత వరకు సబ్ డివిజన్ జరగలేదని వాపోయారు. విజయనగరం జిల్లాలో ఇన్ని ఇల్లు మాజీ సైనికులకు నిర్మిస్తే, అటు అధికారులకు, నాయకులకు ,మంచి పేరు వస్తుందని, రాష్ట్ర అధ్యక్షులు మోటూరి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ దినం సబ్ డివిజన్ గురించి పరిశీలనకు, ఆర్డిఓ కార్యాలయం విజయనగరం నుంచి రెవెన్యూ సర్వే అధికారులు కూడా సైట్ లోకి రావడం సంతోషించారు. అధికారులతో రాష్ట్ర అధ్యక్షులకు జిల్లాలో ఉన్న పలు సమస్యల పట్ల చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దేవర ఈశ్వరరావు మాట్లాడుతూ డిసెంబర్ 16న భారీ బహిరంగ సభ మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున ఏర్పాటు జరుగుతుందని తెలియజేశారు. అనంతరం భారత్ మాతాకు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ తాడ్డి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బార్కుల వెంకటరావు, సుబేదార్ ప్రన్న కుమార్, నారాయణరావు, నరసింగరావు, సూరి నారాయణ, విమల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *