-బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ లేబరేటరీలో జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురైన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని… వారిని క్రిటికల్ కేర్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో మరో ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని సిఎం ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సాయం అందించాలని చంద్రబాబు అధికారులుకు నిర్దేశించారు. బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు.