Breaking News

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాని కలుసుకున్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఉపస్పీకర్ రఘురామ కృష్ణ రాజు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఉపస్పీకర్ రఘురామ కృష్ణ రాజు నేడు ఢిల్లీ పార్లమెంట్ హౌస్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు, రఘురామ కృష్ణ రాజు, త్వరలో జరుగనున్న 16వ ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నూతన సభ్యుల అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఓం బిర్లా ని ఆహ్వానించారు. ఓం బిర్లా  ఆ ఆహ్వానాన్ని గౌరవంగా స్వీకరించి, ప్రతిపాదిత అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి లోక్‌సభ కార్యదర్శులయం ద్వారా అవసరమైన అన్ని సహాయాలు అందించనున్నట్లు హామీ ఇచ్చారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *