అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హోంమంత్రి వంగలపూడి అనితతో ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సునీల్ కుమార్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. 40వేలకు మించి నివాసముండే టిడ్కో గృహాల సమీపంలో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని హోంమంత్రికి వినతిపత్రం సమర్పించారు. 10వేల మంది నివసించే టిడ్కో గృహాల పరిధిలో పోలీస్ అవుట్ పోస్టులు పెట్టాలని కోరారు. అసాంఘీక కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా అన్ని ఎన్టీఆర్ కాలనీలలో సీసీటీవీలను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన హోంమంత్రి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి సత్వరమే తదనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.
Tags amaravathi
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …