-తక్షణమే పునాదులవరకు లబ్దిదారులనే నిర్మించుకోవాలని భయప్రాంతులకు గురి చెయ్యడం సరికాదు…
-టీడీపీ హయాంలో నిర్మించిన TIDCO ఇళ్లను లబ్ధిదారులకు తక్షణమే అందించాలి...
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇళ్ళు లేని నిరుపేదలందరికీ పక్కా ఇళ్ళు ఇవ్వాలని, ఇచ్చిన సెంటు స్థలంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే పూర్తి ఖర్చులతో ఇళ్లను నిర్మించాలని, చంద్రబాబు నాయుడు హయాంలో కట్టిన tidco ఇళ్లను లబ్ది దారులకు తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ శనివారం గాంధీ నగర్ అలంకార్ సెంటర్ లోని ధర్నా చౌక్ నందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిధిగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్బంగా బోండా ఉమా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పేదలు అందరికీ ఉచితంగా ఇళ్లు ఇస్తామన్నారు కానీ అధికారంలోకి వచ్చి 28నెలలు అయినా ఇళ్లు ఊసే లేదు. కొండల్లో, గుట్టల్లో సెంటు స్థలం ఇచ్చి ముఖ్యమంత్రి చేతులు దులుపుకున్నారు అన్నారు. నివాస యోగ్యత లేని స్థలంలో పునాదుల కోసం లక్ష రూపాయలు కట్టమని చెబుతున్నారు, పేదలు ఏ విధంగా అంత డబ్బులు తెస్తారో పాలకులే చెప్పాలి అని అన్నారు.. ముప్పై లక్షల ఇళ్లు ఇస్తామని పేదలను ఇప్పుడు మోసం చేశారు. డబ్బు లేదన్నవారి స్థలాలు రద్దు చేస్తాం అని బెదిరిస్తు పెదాలను భయప్రాంతులకు గురి చేస్తున్నారు అన్నారు. విజయవాడకు 20కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రాంతాల్లో నగరంలోని ఇల్లు లేని నిరుపేదలకు సెంటు భూమి ఇచ్చం అని ఎటువంటి సదుపాయాలు లేని నిర్మానుష్య ప్రదేశంలో ఇవ్వడం జరిగిందని దానికి జగనన్న కాలనీ పేరుతో ప్రభుత్వమే పూర్తి ఖర్చు బరాయించి నిర్మిస్తాం అని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి, ఈరోజు మాట తప్పి ప్రభుత్వం కొంత భరిస్తుంది, మిగిలిన నిర్మాణాన్ని లబ్ధిదారులే భరించాలనడం సరికాదని అన్నారు. ఈ ఆలోచనని తక్షణమే విరమించి ప్రభుత్వమే అన్నిరకాల సదుపాయాలతో ఇళ్లను, కాలనీలను నిర్మించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ సమీపంలోని జక్కంపూడి లో నిర్మించనిన TIDCO ఇళ్లను లబ్ధిదారులకు తక్షణమే అందయించాలని, ఇప్పటికే వారు విజయవాడ కార్పొరేషన్ కమిషనర్ పేరుతో 25వేలు, 50వేలు, లక్ష రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇవ్వకపోవడం వెనుక జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వెనుక దాగి ఉన్న ఎజండా ఏంటో ప్రజలకు వివరించాలని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు ప్రభుత్వ ఖర్చులతోనే నిర్మించి పేదలకు ఇవ్వాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు ఇచ్చేనంతవరకు తెలుగుదేశం పార్టీ తరపున ఉద్యమిస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, మాజీ ఫ్లోర్ లిడార్ ఎరుబోతు రమణ, టీడీపీ నేతలు నందేటి భాను సింగ్, వల్లభనేని సతీష్, లుక్కా సాయిరాం గౌడ్, ఇప్పిలి మోహన్, పిన్నమనేని నాని, మాచెర్ల గోపి, కోసూరు సుబ్బారావు, తోట పాండు, వాకపల్లి ప్రభాకర్, దాసరి జయరాజు, బండారు అంజి, చింతల మధుబాబు, పివిఆర్, అంగిరేకుల రాంబాబు, గరిమెళ్ళ చిన్న, గొట్టుముక్కల శేషంరాజు, గొట్టుముక్కల వెంకీ, పడమటి రామకృష్ణ, సందిరెడ్డి గాయత్రి, మాల్యాద్రి, ఎలుగు వెంకటేశ్వరరావు, బొలిశెట్టి శేషుబాబు, జేమ్స్, షేక్ అజీజ్, చలమలశెట్టి శ్రీనివాస్, గొడవర్తి శ్రీనివాస గుప్త, అల్లా తారక రామారావు, పిరియా సోమేశ్వరరావు, గుంజ గురుమూర్తి, బుధాల సురేష్, బెవర సూరి, చాగర్లమూడి శ్రీనివాస్, అమర్ నాధ్ గౌడ్, దాసరి పెప్సీ, లబ్బ వైకుంఠం, కోలా శ్రీనివాసరావు, మోతుకూరి కాసిం, సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, ప్రధాన కార్యదర్శి లబ్బ దుర్గ, మహిళా నేతలు గరిమెళ్ళ రాధిక, మాదాల సత్య, షేక్ గౌసియా మరియు నాయకులూ, కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.