తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా నేడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన జ్యోతిరావు పూలే అంటరాని తనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు చివరి వరకూ రాజీలేని పోరాటం చేసిన మహనీయుడు అని కొనియాడారు.ఈ దేశానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు. దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్తల్లో మహాత్మా జ్యోతిరావు పూలే ముందు వరుసలో ఉంటారని అన్నారు. అణగారిన వర్గాలు, స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని అన్నాడు. వితంతు పునర్వివాహాల గురించి ఫూలే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాడనీ అన్నారు. స్త్రీ, పురుషుల మధ్య లింగవివక్షను పూలే వ్యతిరేకించారని అన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమ సమాజాన్ని కాంక్షించాడని అన్నారు. జ్యోతిబా పూలే ఆదర్శనీయుడు, చిరస్మరణీయుడు అని మనం అందరం ఆయన అడుగు జాడల్లో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, కలెక్టరేట్ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …