Breaking News

స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కి నివాళులర్పించిన సిఎం నారా చంద్రబాబు నాయుడు

చంద్రగిరి / నారావారి పల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
నారావారి పల్లి గ్రామం నందు గురువారం  చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల అనంతరం నారా రామ్మూర్తి నాయుడు చిత్ర పటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. సిఎం తో పాటు డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణమ రాజు, రాష్ట్ర మంత్రులు విద్యశాఖ, హోమ్ శాఖ, బి. సి సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, రెవిన్యూ శాఖ, జలవనరుల శాఖ, రోడ్డు రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, కార్మిక శాఖ, నారా లోకేష్, కె.అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, బి. సి జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, శ్రీమతి వి.అనిత, శ్రీమతి ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, మాజీ కేంద్ర మంత్రి మరియు రాష్ట్ర బి జె పి అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎమ్మెల్సీ లు కంచర్ల శ్రీకాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం, శాసనసభ్యులు పలమనేరు, పీలేరు, పూతలపట్టు, చంద్రగిరి, సత్యవేడు, నగరి,చిత్తూరు,శ్రీకాళహస్తి, మదనపల్లి, పొన్నూరు, సూళ్లూరుపేట, గంగాధర్ నెల్లూరు, రాయదుర్గం, యన్.అమరనాథ్ రెడ్డి, ఎన్. కిషోర్ కుమార్ రెడ్డి, కె.మురళీమోహన్, పులివర్తి నాని, కె. ఆదిమూలం,గాలి భాను ప్రకాష్, గురజాల జగన్మోహన్, బొజ్జల సుధీర్ రెడ్డి, షాజహాన్ బాషా, దూళిపాళ్ళ నరేంద్ర, నెలవల విజయశ్రీ, వి. యం.థామస్,కె.శ్రీనివాసులు, రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రివర్యులు నిమ్మకాయల చిన్న రాజప్ప, ఉమా మహేశ్వర రావు, మాజీ ఎమ్మెల్సీ లు బుడ్డా వెంకన్న, రాజ సింహులు (దొరబాబు ) మాజీ ఎమ్మెల్యేలు సి.కె.జయచంద్రా రెడ్డి (సి కె బాబు )ఏ ఎస్.మనోహర్, సుగుణమ్మ, నెలవల సుబ్రహ్మణ్యం, కడప జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి,టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శ్యాప్ చైర్మన్ రవి నాయుడు, మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, బిజెపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *