విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ( ఏపీ ఎస్ ఎస్ డి సి ), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ ఆధ్వర్యంలో 2025 మార్చి వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించే జాబ్మేళా తేదీలు, ప్రదేశాల వివరాలతో రూపొందించిన క్యాలెండర్ను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ గురువారం ఆవిష్కరించారు. శాసనసభ్యుని కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. నిరుద్యోగులు ఆసక్తి గల రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ విభాగం ద్వారా శిక్షణ పొంది ఉపాధి పొందాలని గద్దె రామమోహన్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ శ్రీనివాసరావు, ఎం రమ్య వర్ధిని, ఎ మోహన్ బాబు లు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …