Breaking News

“వాసవ్య మహిళా మండలి”, “ బాల వివాహ్ ముక్త్ భారత్” కు మద్దతు ఇస్తుంది…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా “బాల్ వివాహ్ ముక్త్ భారత్” (బాల్యవివాహ రహిత భారత్) ప్రచారాన్ని న్యూఢిల్లీలో ప్రారంభిస్తున్న నేపథ్యంలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ‘వాసవ్య మహిళా మండలి’ వారు ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని జిల్లాయంత్రాంగం నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమానికి హాజరైన Admn డీసీపీ, NTR district కృష్ణమూర్తి నాయుడు, Ms. లతా కుమారి , ACP, మహిళా పోలీస్ స్టేషన్, Ms. ఉమా దేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్ , విమెన్ డెవలప్మెంట్ and చైల్డ్ వెల్ఫేర్, NTR జిల్లా, Ms. వాసవి , CI, మహిళా పోలీస్ స్టేషన్, మరియు Mr. K త్రినాధ్ కుమార్ (మండల లీగల్ సర్వీస్ అథారిటి), Y. జాన్సన్ DCPU, NTR జిల్లా, Mr. KMK. రెడ్డి HM, జిల్లాను బాల్యవివాహ రహితంగా చేయాలని తీర్మానించారు.

వాసవ్య మహిళా మండలి అనేది జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ లో భాగం, ఇది బాలల రక్షణ హక్కుల కోసం పనిచేస్తున్న 250కి పైగా ఎన్జీవో పార్టనర్ల జాతీయ కూటమిలో ఒకటి. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం బా,ల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచారాన్ని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ప్రారంభించింది. జిల్లాలో ‘వాసవ్య మహిళా మండలి’, ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలతో జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. దేశవ్యాప్తంగా 400కు పైగా జిల్లాల్లో పనిచేస్తున్న 250కి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ ఎన్జీవో పార్టనర్ల జాతీయ నెట్వర్క్ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (జేఆర్ సి)

కూటమిలో పార్టనర్ గా ఉంది. కృష్ణమూర్తి నాయుడు, Admn డీసీపీ, NTR district, Ms. లతా కుమారి, ACP, మహిళా పోలీస్ స్టేషన్, Ms. ఉమా దేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్, విమెన్ డెవలప్మెంట్ and చైల్డ్ వెల్ఫేర్, NTR జిల్లా, Ms. వాసవి, CI, మహిళా పోలీస్ స్టేషన్, వీరందరు కామెండొ కంట్రోల్ రూమ్, విజయవాడ నందు మరియు Mr. K త్రినాధ్ కుమార్, మండల లీగల్ సర్వీస్ అథారిటి, Y. జాన్సన్ DCPU, NTR జిల్లా, Mr. KMK. రెడ్డి HM, KSRZPGH స్కూల్ పటమట నందు ఈ వేడుకలో పాల్గొని బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది గ్రామస్తులు, గ్రామపెద్దలు, చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (సీఎంపీవో), ఆశా వర్కర్లు, జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, మహిళలు ప్రతిజ్ఞ చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

బాల్య వివాహాలను నిర్మూలించడానికి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి “అన్నపూర్ణాదేవి” నవంబర్ 27న ప్రకటించిన, “బాల్ వివాహ్ ముక్త్ భారత్” ప్రచారానికి ప్రతిస్పందనగా జిల్లాలో ఈ కార్యక్రమం జరిగింది. దేశంలోని అన్ని గ్రామపంచాయతీలు, పాఠశాలల్లో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఆమె ప్రతిజ్ఞ చేశారని, ఈ ప్రచారం 25 కోట్ల మందికి చేరుతుందని భావిస్తున్నారు. బాల్య వివాహాల గురించి సులభంగా తెలియజేయడానికి ఒక జాతీయ పోర్టల్ ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా NTR జిల్లా నుండి హాజరైన Admn డీసీపీ, NTR district, మరియు మండల లీగల్ సర్వీస్ అథారిటి మాట్లాడుతూ (కృష్ణమూర్తి నాయుడు, మరియు Mr. K త్రినాధ్ కుమార్) దేశవ్యాప్త ప్రచారం గురించి మరియు ఇది క్షేత్రస్థాయిలో వారి పనిని ఎలా వేగవంతం చేస్తుందనే దాని గురించి వివరించారు. “Dr. బొల్లినేని కీర్తి” మాట్లాడుతూ, బాల్యవివాహాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ అధికారులు, స్థానిక పెద్దలతో కలిసి జిల్లాలో పనిచేస్తున్నామని, ఇలాంటి వివాహాలను అరికట్టాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రచారం ఈ పోరాటానికి కొత్త శక్తిని, మద్దతును ఇస్తుంది. ఇన్నాళ్లూ సాగిన పోరాటం ఎట్టకేలకు బాల్యవివాహాలకు ముగింపు పలకడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చే క్షణం. బాల్యవివాహాల నేరానికి ఇకపై ఏ ఆడపిల్ల కూడా మూగబోదని, ప్రతి బిడ్డకు సరైన బాల్యాన్ని అందించేందుకు తమ శక్తి మేరకు కృషి చేస్తామని భారత్ ప్రపంచానికి చాటిచెప్పింది.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *