ప్రొద్దుటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా మాజీ సైనికుల సమస్యలు పరిష్కారమౌతాయని మాజీ సైనికోద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోటూరు శంకరరావు తెలిపారు. గురువారం పొద్దుటూరు జరిగిన స్టేట్ అసోసియేషన్ సభ్యత్వం కారక్రమానికి విచ్చేసిన ఆయన మాజీ సైనికోద్యోగుల సంఘం సభ్యత్వ నమోదులో మాట్లాడుతూ ఇన్నే ళ్లుగా ఎన్ని ప్రభుత్వాలకు మాజీ సైనికోద్యోగుల సమస్యలు చెప్పి నా పట్టించుకోలేదన్నారు. నారాలోకేష్ పాదయాత్ర సందర్భంగా సమస్యలు ఆయన దృష్టికి తెచ్చామన్నారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీ మేరకు మాజీ సైనికోద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్ర మంలో రాయలసీమ జోన్ అధ్యక్షుడు చంద్ర మోహన్ రెడ్డి కడ ప పార్లమెంటు అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ జయశంకర్ పట్టణ నాయకులు నెల్సన్ తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …