Breaking News

పి హెచ్ సి లలో మెరుగైన సేవలు అందించాలి

-దోసకాయలపల్లి పి హెచ్ సి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టరు ప్రశాంతి

కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకి మెరుగైన సేవలు, చికిత్సా విధానాలు అందుబాటులో ఉండేలా క్షేత్ర స్థాయి సిబ్బంది పని తీరు ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం ఉదయం స్థానిక పి హెచ్ సి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రికి వైద్య సేవలు నిమిత్తం వొచ్చిన వారితో సంభాషించి వివరాలు తెలుసుకోవడం జరిగింది. పి హెచ్ సి లో ఏ ఎన్ ఎం లు ఎందుకు ఉన్నారో అడిగి తెలుసుకోవడం తో పాటు, వారు సేవలు అందించే గ్రామాల వివరాలు, అక్కడ ఎంత మంది గర్భిణీలు బాలింతలు ఉన్నారు, వారి అంద చేస్తున్న వైద్య అనుబంధ సేవల వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లడుతూ, ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన చికిత్స అందించడం కోసం తగిన మౌలిక వసతులు కల్పించడం తో తదనుగుణంగా పరికరాలను కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపధ్యంలో గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ అయ్యేందుకు కావలసినవి సూచనలను సలహాలను ఇవ్వడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. కొందరు ఆశా వర్కర్లు, అంగన్వాడి కార్యకర్తలు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స కోసం సిఫార్సు చేస్తున్నట్లు తమ దృష్టికి రావడం జరిగిందన్నారు. మీ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగుల పనితీరు పర్యవేక్షణా బాధ్యత మీపై ఉందనే విషయం కలెక్టరు గుర్తూ చేశారు. ప్రతి ఒక్క డెలివరీ కేసు ను మొదటి నుంచి పర్యవేక్షణా చెయ్యడం లో వారి ఆరోగ్య స్థితిగతులను అధ్యయనం చేసే అవకాశం ఉందని, ఆమేరకు వైద్య సేవలు అందించే బాధ్యత మనందరిపై ఉందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. పి హెచ్ సి వైద్యాధికారి డా వి. కోటేశ్వరరావు ఆసుపత్రిలో అందచేస్తున్న సేవలను వివరించారు. ఆసుపత్రి వైద్యులు గ్రామ స్థాయిలో వైద్య సిబ్బంది అందించే సేవల వివరాలు తెలుసుకోవడం, వాటి రికార్డుల నిర్వహణ పై జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ నేపధ్యంలో సిబ్బంది రావడం జరిగిందన్నారు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *