-డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాడులు
-మూడు వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
-డి ఈ పి వో సిహేచ్ లావణ్య
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం డ్రోన్ ద్వారా సర్వే చేపట్టి అక్రమంగా నిలవ ఉంచిన బెల్లం ఊట ను గుర్తించి ధ్వంసం చెయ్యడం జరిగిందని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్. లావణ్య తెలియ చేశారు. రాజమహేంద్రవరం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ నార్త్, సౌత్ స్టేషను పరిధిలోని బృందాలతో కలిసి గోంగూర లంక, వెంకటనగరం లంక, పిచుక లంక, బొబ్బిలి లంక వద్ద డ్రోన్ ఉపయోగించి సంయుక్త దాడులు నిర్వహించామనీ తెలిపారు. .ఉత్తర మరియు దక్షిణ స్టేషన్ పరిమితుల్లో మరియు 1800 లీటర్లు ,150 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నామన్నారు. అదే విధంగా దేవరపల్లి స్టేషన్ పరిధిలో 1200 లీటర్ల బెల్లం ఊట ను గుర్తించి ధ్వంసం చేశామన్నారు. జిల్లాలో ఎక్కడైనా బెల్లం ఊట నిల్వలు ఉంటే సమాచారం అందించి సహకరించాలని, అటువంటి వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు.