Breaking News

హాస్ట‌ల్ విద్యార్థుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రేణిగుంట బీసీ హాస్ట‌ల్ విద్యార్థుల స‌మ‌స్య‌ను తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి ప‌రిష్క‌రించారు. గ‌తంలో బీసీ హాస్ట‌ల్ విద్యార్థులు తిరుప‌తి ఎంపీ కార్యాల‌యానికి వెళ్లారు. ర‌క్షిత మంచి నీటి స‌దుపాయం లేద‌ని, క‌లుషిత నీళ్లు తాగి రోగాల బారిన ప‌డుతున్న‌ట్టు ఎంపీ ఎదుట విద్యార్థులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అలాగే నాయుడుపేట బీఆర్ అంబేద్క‌ర్ గురుకుల‌ హాస్ట‌ల్‌లో క‌లుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురైన సంద‌ర్భంలో, ఎంపీ వారిని ప‌రామ‌ర్శించారు. ఆ సంద‌ర్భంలో సుర‌క్షిత మంచినీటిని అందించాల‌ని విద్యార్థులు విన్న‌వించారు. విద్యార్థుల ద‌య‌నీయ స్థితిని గుర్తించి, వెంట‌నే రేణిగుంట బీసీ సంక్షేమ వ‌స‌తి గృహంలో ర‌క్షిత మంచినీటి ప‌థ‌కానికి రూ.2.50 ల‌క్ష‌లు, నాయుడుపేట గురుకుల పాఠ‌శాల‌లో ర‌క్షిత మంచినీటి ప‌థ‌కానికి రూ.3 ల‌క్ష‌లు త‌న ఎంపీ నిధుల నుంచి కేటాయించారు. ఇప్పుడా ప‌నులు పూర్త‌యి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త‌మ‌కు ర‌క్షిత మంచినీటిని అందించ‌డానికి ముందుకొచ్చి నిధులు మంజూరు చేసిన తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *