విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపియస్ ఆర్టీసిలో పనిచేస్తున్న పిటిడి ఉద్యోగులకు అటు ప్రభుత్వం వద్ద,ఇటు ఆర్టీసి మేనేజ్ మెంటు వద్ద పెండింగు ఉన్న సమస్యలు పరిష్కారంకోసం ఈనెల 7 న ఆర్టీసి మేనేజింగు డైరెక్టర్ గారికి ఇచ్చిన లేఖపై ఈనెల 19/20 తేదిలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపో,యూనిట్ల వద్ద ధర్నాలు చేపట్టాలని తీసుకున్న నిర్ణయం పై గౌః రవాణామంత్రి శ్రీ.మండిపల్లి రాంప్రసాధ్ రెడ్డి గారు,ఆర్టీసి యం.డి శ్రీ.సిహెచ్.ద్వారకా తిరుమలరావు గారు చొరవ తో శుక్రవారం ఇ.యు రాష్ట్రకమిటి తో ఆర్టీసి హౌస్ లోఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) శ్రీ.జి.రవివర్మ గారి ఆద్వర్యంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటితో జరిగిన చర్చలలో ఇ.యు ఇచ్చిన మెమోరాండలోని 26 డిమాండ్లుపై సానుకులంగా చర్చలు జరిగాయని ఏపిపిటిడి(ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు,రాష్ట్రప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్టీసి ఉద్యోగ బద్రతపై తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2019 లో ఇచ్చిన సర్క్యులర్ నెంః 01/2019 ని ఇకపై యధావిధిగా అమలు జరిగేలా చుస్తామని హామి ఇచ్చారు.అలాగే ఇంతవరకు సర్క్యూలర్ నెంః 01/2019 కు వ్యతిరేకంగా ఇచ్చిన పనిష్ మెంట్లు పై సంబందిత పై అధికార్లుకు అఫీల్సు పెట్టుకుంటే వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామిఇచ్చారు అంతే కాకుండా ప్రభుత్వపరిధిలో ఉన్న నైట్ అవుట్ అలవెన్సులు,పదోన్నతలు సమస్యను త్వరలో పరిష్కస్తామని ఇడి(ఏ)హామి ఇచ్చారు.వీటితో పాటు ట్రాఫిక్ & మెంటినెన్సుఉద్యోగులు,నాన్ ఆఫరేషన్ ఉద్యోగులు సమస్యలు,క్లరికల్ సమస్యలు పరిష్కానికి కూడా హామి ఇచ్చారని వారు తెలిపారు.
ఈసమావేశంలో ఇ.యు రాష్ట్రనాయకులు పి.సుభ్రమణ్యం రాజు, కె.నాగేశ్వరరావు,జి.నారాయణరావు,పిబానుమూర్తి,యం.శంకరరావు,యన్.హెచ్ .యన్ . చక్రవర్తి,నాలుగు జోన్ల కార్యదర్శులు దాసరి శామ్యూల్ బాబు,యన్.రాజశేఖర్, వై.శ్రీనివాసరావు,బాసూరికృష్టమూర్తి పాల్గొన్నారు.
అలాగే ఆర్టీసి మేనేజ్ మెంటు తరుపున .ఎఫ్.ఏ సుధాకర్,ఇ.డి. విజయరత్నం,జి.నాగేంధ్రప్రసాధ్,చాగంటి విమల,జయశంకర్,కిశోర్ తధితరులు చర్చలలో పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …