Breaking News

కార్యకలాపాలు నిర్వహించని బోట్స్ మ్యాన్ సొసైటి ల అనుమతులు రద్దు చేయాలి

-అనుమతులు పొందిన సొసైటి ల కార్యకలాపాలు పై 48 గంటల్లో నివేదిక అందజేయాలి
-రీ టెండర్ ప్రక్రియ పై ఎస్ వో పి అనుసరించి చర్యలు తీసుకోవాలి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డిసిల్టేషన్ పాయింట్స్ ఆధ్వర్యంలో కనీస స్థాయిలో త్రవ్వకాలు జరిపే విధానం ఉండాలనీ, ఇందులో ఎటువంటి విచలనం (diviation ) లేకుండా పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, డి ఎల్ ఎస్ ఎ ఛైర్మన్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లా పరిధిలో 140 బోట్స్ మ్యాన్ సొసైటి లకి డిసిల్టేషన్ పాయింట్స్ వద్ద ఇసుక త్రవ్వకాలు జరిపేందుకు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. సంభందిత బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులు జీవన భృతి కొరకు చేసుకున్న విజ్ఞప్తిని అనుసరించి ఇసుక త్రవ్వకాలు జరపాల్సిందిగా అనుమతులు జారీ చేశామని తెలిపారు. అందుకు అనుగుణంగా ఆయా బోట్స్ మ్యాన్ సొసైటిలు కనీస స్థాయిలో త్రవ్వకాలు చేపట్టాలని, ఆ ప్రక్రియపై పర్యవేక్షణా తప్పనిసరి అని ఆదేశించారు. 48 గంటల్లో ఏ ఏ బైట్స్ మ్యాన్ సొసైటి ల రోజుకి ఎంత చొప్పున ఇసుక త్రవ్వకాలు జరిపారో ఇరిగేషన్, మైన్స్ అధికారులు సమగ్ర నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. ఎటువంటి త్రవ్వకాలు నిర్వహించకుండా నిరార్ధకంగా బోగస్ గా ఏర్పడిన బోట్లు మ్యాన్ సొసైటి ల అనుమతులు నివేదిక ఆధారంగా రద్దు చేయాలన్నారు. ఆమేరకు వొచ్చే కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి తెలియ చేశారు.

ట్రాక్టర్ల ద్వారా ఉచిత ఇసుక సరఫరా విధానం పై గణాంకాలు తెలియ చెయ్యాలని, అధికారుల సమక్షంలో నమోదు చేసుకున్న ట్రాక్టర్ల ద్వారా సరఫరా విధానం ఉండాలన్నారు. ఉచిత ఇసుక పాలసీ విధానంలో ఎంతమందికి ప్రయోజనం చేకూర్చగలిగాం తెలుసుకోవడం సాధ్యం అవుతుందని తెలిపారు. ఆర్డీవోలు ఈమేరకు చర్యలు తీసుకోవడం, వొచ్చే సమావేశంలో నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. ఓపెన్ రిచ్ లలో త్రవ్వకాలు, లోడింగ్ సమాంతరంగా చేపట్టాలని, డంప్పింగ్ చేయరాదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రాఘవ ఏజెన్సీస్ కి ఇచ్చిన అనుమతులు డిసెంబర్ 20 తో ముగుస్తుందని అధికారులు కలెక్టరు కి వివరించారు. ఈ నేపధ్యంలో కొత్తగా సెమీ మెకన్సైజ్డ్ విధానం లో ఇసుక త్రవ్వకాల కోసం ఏజెన్సీ గుర్తించే ప్రక్రియ ను ప్రారంభించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానం తో పాటు, “ఈ ఎమ్ డి” మొత్తాన్ని పెంచాలని ఆదేశించారు. టెక్నికల్ కమిటీ లో జి ఎస్టీ అధికారిని కూడా సభ్యునిగా నియమించాలని కలక్టర్ తెలియ చేశారు. ఇసుక అక్రమ త్రవ్వకాలు జరిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సుముటో గా కేసులు నమోదు చేయాలన్నారు. అక్రమ రవాణా జరిపే పాయింట్స్ వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో కొత్తగా నాలుగు ఓపెన్ రిచ్ లని గుర్తించామని, వేమగిరి (కడియం) , తిపర్రు (పెరవలి) , పెండ్యాల (నిడదవోలు) , పందలపర్రు (నిడదవోలు) జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. వీటికి జియో గ్రాఫికల్ విధానం రీచ్ కి పేరు ప్రతిపాదించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమన్వయ శాఖల కమిటీ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి సిఫార్సు చేయాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, అదనపు ఎస్పి ఎన్ బి ఎమ్ మురళీ కృష్ణ, ఆర్డీవోలు ఆర్ కృష్ణ నాయక్ , రాణి సుస్మిత , జిల్లా మైన్స్ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి, ఈ ఈ (ఇరిగేషన్ రివర్ కన్సర్వేటరీ) ఆర్ కాశీ విశ్వేశ్వర రావు, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, జిల్లా భూగర్భ జల అధికారి వై శ్రీనివాస్, జిల్లా ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారి బి వి గిరి లు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *