నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్ల పై ఆరబెట్టిన ధాన్యం తక్షణం మిల్లులకు తరలించాలని పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి రాధిక రైతులకు విజ్ఞప్తి చేశారు. శనివారం కలెక్టరు ఆదేశాల మేరకు పెరవలి , ఉండ్రాజవరం మండలాల పరిధిలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ పర్యటించారు. ఈ సందర్బంగా జిల్లా మేనేజర్ టి రాధిక వివరాలు తెలియ చేస్తూ, జిల్లా యంత్రాంగం పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేపట్టే నేపథ్యంలో రైతులకి ప్రయోజనం చేకూర్చే విధంగా 2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేపట్టడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. క్వింటాల్ ధాన్యం కొనుగోలు చేసేందుకు కామన్ వెరైటీ కి రూ.2300 , ఏ గ్రేడ్ వెరైటీ కి రూ.2320 కనీస మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 221 రైతూ సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం జరిగిందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రాంతాల వారీగా రైతులు కోతలు కొస్తున్న ప్రాంతాలలో కొనుగులు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతోంది అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 202 కోనుగోలు కేంద్రాల ద్వారా 19,916 మంది రైతుల నుంచి 28,727 ఎఫ్ టి వో ల ద్వారా 1,57,700 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసినట్లు తెలిపారు. ఇందు నిమిత్తం రైతులకి చెల్లించాల్సిన రు.362 కోట్ల 74 లక్షలకు గాను రూ.300 కోట్ల 64 లక్షలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో కోతలు పూర్తి అయి బహిరంగంగా ఉంచిన, రహదారులపై ఆరబెట్టిన ధాన్యం ను మిల్లులకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకి కనీస మద్దతు ధర కల్పించే దిశలో జిల్లా యంత్రాంగం తరపున అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా కంట్రోల్ రూం నెంబర్: 8309487151 కు గానీ, .టోల్ ఫ్రీ నంబరు : 1967 కు గానీ ఫిర్యాదు చేయవచ్చునని రాధిక తెలియ చేశారు. ఈ పర్యటన లో ఇండ్రాజవరం తహసిల్దార్ పి ఎన్ డి ప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Tags rajamandri
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …