Breaking News

అలరించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం

-భారత మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం నందు శ్రోతలను అద్భుతంగా అలరించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణవేణి సంగీత నీరాజనం 2024 వేడుకకు పూర్వ రంగంగా, భారత మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, టెక్స్ టైల్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నేడు సంగీత కచేరీ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, సదరు కార్యక్రమాలు శ్రోతలను అద్భుతంగా అలరించాయి, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించుకుందామని తిరుపతి ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు పేర్కొన్నారు.

స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం నందు కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక ఎంఎల్ఏ పాల్గొనగా ఎస్వీ యూనివర్సిటీ విసి అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ప్రో. కాత్యాయని, స్టూడెంట్ అఫైర్స్ ఎస్పీఎంవివి, రీటా చౌదరి కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమి, కేంద్ర ప్రభుత్వ సదరన్ జోన్ టూరిజం డిపార్ట్మెంట్ ఆర్డి వెంకటేశన్, నోడల్ అధికారిణి ఆం.ప్ర సాంస్కృతిక శాఖ నెల్లూరు జిల్లా మ్యూజిక్ కాలేజీ జ్యోతి, ఏపీ టూరిజం శాఖ ఆర్డీ రమణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం మన తిరుపతి జిల్లాలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం నందు నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. విద్వాన్ శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, విదుషి శ్రీమతి బుల్లెమ్మ బృందం గాత్ర సంగీత కచేరి అభినందనలు తెలియజేసారు. గతంలో నారా చంద్రబాబునాయుడు సిఎం గా ఉన్న హయాంలో తిరుపతి స్థానిక వాస్తవ్యులకు ఐదు సంవత్సరాలు దర్శన భాగ్యం కల్పించడం జరిగిందనీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మన గౌ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇచ్చిన మాటకు కట్టుబడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుపతి స్థానిక వాస్తవ్యులకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఉచిత దర్శన భాగ్యం ప్రతి నెల మొదటి మంగళవారం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని, వారికి తన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కేంద్ర, ఆం.ప్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈనెల 7 నుండి 8 వరకు కృష్ణవేణి సంగీత నీరాజనం విజయవాడలో నిర్వహించుకోవడం జరుగుతుందని సంతోషం అని తెలిపారు. ఆధ్యాత్మిక, ఎకో టూరిజం, బీచ్ టూరిజం తదితర టూరిజం ప్రమోషన్ కార్యక్రమాలను తిరుపతిలో చేపట్టి తిరుపతి జిల్లాను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఇందుకు మన సిఎం, డిప్యూటీ సీఎం, టూరిజం శాఖ మంత్రి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు.

ఎస్వీ యూనివర్సిటీ విసి అప్పారావు మాట్లాడుతూ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారి దివ్య కచేరీలు ఎంతో ప్రాచుర్యం కలవని అన్నారు. అన్నమాచార్య కీర్తనలు ఎన్నో వారు వీనుల విందుగా శ్రోతలకు పలు కార్యక్రమాలలో పాల్గొని అందించారని తెలిపారు.

ఈ సందర్భంగా సాంస్కృతిక ఘనత కలిగిన సంగీత కచేరీలను ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలలో నిర్వహిస్తున్నారనీ, సంగీత అభిమానులకు కచేరీల నిర్వహణ ద్వారా సుస్వర వారసత్వ, భక్తి సంబంధ అనుభూతిని అందించడానికి కృష్ణవేణి సంగీత నీరాజనం వేడుక సిద్ధమైందనీ ప్రాంతీయ సంచాలకులు ఏపీ టూరిజం, తిరుపతి డా.రమణ ప్రసాద్ మరియు నోడల్ అధికారి జ్యోతిర్మయి ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజి, నెల్లూరు సంయుక్తంగా పేర్కొన్నారు.

అనంతరం విద్వాన్ శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, విదుషి శ్రీమతి బుల్లెమ్మ బృందం గాత్ర సంగీత కచేరి కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించి ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *