-ప్రయాణికులు సద్వినియోగం చేసుకోగలరు
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి రోజున ఇండిగో ఎయిర్‌లైన్స్ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పారవిమానయాన శాఖామాత్యులు రామ్మోహన్ నాయుడు గారి కృషి, నాయకత్వంలో తిరుపతి నుండి ముంబైకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించిందని తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ శ్రీనివాస రావు మన్నె ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఈరోజున తిరుపతిలో ప్రారంభించిన నేరుగా వెళ్ళే తిరుపతి – ముంబయి ఇండిగో విమాన సదుపాయంతో తిరుపతి విమానయాన రంగానికి కొత్త అధ్యాయాన్ని తెరచిందని అన్నారు. ఫ్లైట్ నంబర్ 6E532 ముంబై నుండి తిరుపతికి విమానం ఉదయం 05:30 గంటలకు బయలుదేరి, 07:15 గంటలకు తిరుపతికి చేరుకుంటుందనీ, ఫ్లైట్ నంబర్ 6E533 తిరుపతి నుండి ముంబయికి విమానం ఉదయం 07:45 గంటలకు బయలుదేరి 9.25 గం.లకు ముంబయికి చేరుకుంటుందని అన్నారు. ఈ విమాన సర్వీసు వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటుందని అన్నారు.
ఈ నేరుగా విమాన సదుపాయం ప్రారంభంతో, తిరుపతి మరో మెట్రో నగరంతో విజయవంతంగా అనుసంధానమైందని, ఇది తిరుపతి విమానయాన రంగంలో ప్రగతిని సూచిస్తుందని అన్నారు. ఈ సదవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయ సిఎస్ఓ రాజేంద్ర ప్రసాద్, విమానాశ్రయ అధికారులు, సిబ్బంది ఇండిగో ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.