-బిసి స్టడీ సర్కిల్ సంచాలకులు కె .ఎన్. జ్యోతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం రాజమహేంద్రవరం నందు నవంబర్ 27 న నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని 13 మంది అభ్యర్థులు అర్హత సాధించడం జరిగిందని బిసి స్టడీ సర్కిల్ సంచాలకులు కె .ఎన్. జ్యోతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు.
సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్‌కు ప్రవేశ పరీక్ష కు ఉమ్మడి తూర్పు – పశ్చిమ గోదావరి జిల్లాలోని కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు , అల్లూరి సీతారామరాజు జిల్లాల నుండి మొత్తం 75 దరఖాస్తులు రాగా, ఈరోజు 70 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరు అయ్యారన్నారు. వారిలో ఈ దిగువ పేర్కొన్న 13 మంది ఉచిత శిక్షణ కు అర్హత పొందినట్లు తెలియ చేశారు. యూపీఎస్సీ సివిల్స్ కోసం ఉచిత కోచింగ్‌లో ప్రవేశానికి కామన్ స్క్రీనింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గొల్లపూడి కేంద్రంలో ఆరు మాసాల పాటు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు వసతులతో కూడి ఉపకార వేతనం తో కూడిన ఉచితంగా శిక్షణను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉచిత సివిల్ కోచింగ్ శిక్షణ కు ఎంపికైన అభ్యర్థులు పట్టుదలతో శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బి సి – ఏ కి చెందిన అరదాడి రవి రాజు , పంతాడి మణికంఠ , చాకలి రాఘవేంద్ర ,
బిసి – బి కి చెందిన సూరిశెట్టి యు.ఎస్.నాగేశ్వరి , కొప్పిశెట్టి సత్య ప్రసాద్ , కర్రి ఎస్ సి చరిత , పి.శ్రీ యశస్వి కృష్ణ ,
బిసి – సి కి చెందిన దావులూరి దేవ సాహితి , కంకిపాటి సందీప్ కుమార్ ,
బిసి – ఇ కి చెందిన షేక్ అక్బీర్ ,
ఎస్సి కి చెందిన చల్లబత్తుల శ్రీధర్ ,
ఎస్టీ కి చెందిన ముర్ల కవిత శ్రీ , కుంజా సాయి కిరణ్ .