Breaking News

మధురపూడి నుంచి ముంబై నేరుగా విమానయానం

-తొలి సర్వీస్ 120 మంది ప్రయాణికులతో రా. 7.15 కు ముంబై కు బయలు దేరింది
-డిసెంబర్ 12 నుంచి న్యూ ఢిల్లీ కి నేరుగా విమాన సర్వీస్
-ఎయిర్పోర్ట్ డైరక్టర్ జ్ఞానేశ్వర

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మొట్ట మొదటి సారిగా రాజమండ్రి విమానాశ్రయం నుండి ముంబై మహనగరానికి ఎయిర్ బస్ ఆపరేషన్స్ మొదలు అయినట్లు రాజమండ్రి విమానాశ్రయం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్. జ్ఞానేశ్వర రావు తెలియ చేశారు. ఆదివారం సాయంత్రం 6.00 గంటలకి మధురపూడి విమానాశ్రయం నుంచి ముంబై విమాన సర్వీస్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్. జ్ఞానేశ్వర రావు వివరాలు తెలియ చేస్తూ, 01.12.2024 న సాయంత్రం ముంబై నుండి రాజమండ్రి, రాజమండ్రి నుండి ముంబై ఎయిర్ బస్ ఫ్లైట్ బయలుదేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి స్ధానిక అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో నిర్వహించడం జరిగింది అని పేర్కొన్నారు.

ఇప్పుడు నేరుగా ముంబై కు వెళ్లాలని అనుకునే ప్రయాణికులకు ఇండిగో విమాన సర్వీస్ లు రాజమండ్రీ – మధురపూడి విమానాశ్రయం నుంచి అందుబాటులోకి రావడం జరిగిందన్నారు. ముంబై నుంచి రాజమండ్రీ, రాజమండ్రీ నుంచి ముంబై కు నేరుగా ఈ ఇండిగో విమాన సర్వీసు లు నేటి నుంచి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు.

తొలి సర్వీస్ ఆదివారం సాయంత్రం “6 ఈ 582” ముంబై నుంచి రాజమండ్రికి ముంబై లో సా.4.50 కు బయలుదేరి రాజమండ్రికి సా.6.45 కు చేరుకుంటుందని తెలిపారు. అనంతరం “6 ఈ 583 ” రాజమండ్రి నుంచి ముంబై కు రాజమండ్రి లో రా.7.15 కు బయలుదేరి ముంబై కు రా.9.05 కు చేరుకోనున్నట్లు తెలిపారు. మొత్తం ఇరు నగరాల మధ్య ప్రయాణ సమయం ఒక గంట 50 నిమిషాల వ్యవధి పడుతుందని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్. జ్ఞానేశ్వర రావు పేర్కొన్నారు.

ముంబై నుంచి 172 మంది ప్రయాణీకులతో రాజమండ్రికి రావడం జరిగిందన్నారు. అదే విధంగా తొలి సర్వీస్ లో రాజమండ్రి నుంచి ముంబై కు 120 మంది ప్రయాణించడం జరిగిందని తెలిపారు. ముంబై నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో విమానానికి పైపుల ద్వారా నీటిని వెదజల్లి స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో విమానాశ్రయ అధికారులు, ప్రయాణీకులు పాల్గొన్నారు.

డిసెంబర్ 12 న న న్యూ ఢిల్లీ నుంచి రాజమండ్రి కి నేరుగా” 6 ఈ 364 ” ఇండిగో విమాన సర్వీస్ ఉదయం 7.30 గంటలకు బయలు దేరి రాజమండ్రీ కి ఉదయం 9.45 కు చేరుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ 12 ఉదయం 10.30 కు రాజమండ్రి నుంచి బయలుదేరి న్యూ ఢిల్లీ కి మ.1.00 గంటకి చేరుకుంటుందని తెలిపారు. మొత్తం ఇరు నగరాల న్యూ ఢిల్లీ – రాజమండ్రి మధ్య ప్రయాణ సమయం రెండు గంటల 15 నిమిషాల వ్యవధి పడుతుందని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్. జ్ఞానేశ్వర రావు పేర్కొన్నారు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *