Breaking News

భూపతిరాజు సూర్య నారాయణ రాజు పేరిట ట్ర‌స్ట్

-కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రకటన

భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నా తండ్రి భూపతిరాజు ‌సూర్యనారాయణ రాజు పేరిట ట్ర‌స్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రకటించారు. పార్లమెంటు సభ్యుడు గా వచ్చే బెనిఫిట్ కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వినియోగిస్తానని తన తండ్రి ‌సం‌స్మరణ సభలో ప్రకటించారు. బిజెపి కార్యకర్త గా ప్రస్తానం ప్రారంభించి తండ్రి ప్రోత్సాహం తో ఈ స్థాయికి చేరుకున్నాను అన్నారు. మా కుటుంబం స్వాతంత్ర్య సమరయోధులు కుటుంబం కావడంతో పాటు రాజకీయ ప్రవేశం కూడా తండ్రి ప్రోత్సాహం కారణం అంటూ తండ్రి ని తలుచుకుంటూ కంటతడి పెట్టారు. గాద్గద స్వరం తో తండ్రి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో తాను చేయవలసిన కర్తవ్యాన్ని వివరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఒక రోజు సమయం కేటాయించి కార్యకర్తలు గర్వ పడే విధంగా పని చేస్తానని అదేవిధంగా కూటమి పార్టీ లతో సమన్వయం చేస్తూ అభివృద్ధి పధం లో తీసుకుని వెడతానన్నారు. నా వద్ద కు ఏపని ఉన్నా నేరుగా కలవవచ్చు అని హామీ ఇచ్చారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో డయాలసిస్ సెంటర్ లు ఏర్పాటు చేయడానికి నిధులు తీసుకుని వచ్చానన్నారు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *