Breaking News

సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించడమే మా ప్రభుత్వ లక్ష్యం.

– నాటక కళాకారులకు పింఛన్ ను పునరుద్ధరణకు కృషి చేస్తా.
– పద్యనాటకం కేవలం తెలుగు వారి స్వంతం.
– పర్యాటక, కళా రంగాన్ని పెంచి పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– కళా సాంస్కృతిక పునరుజ్జీవం కోసం అందరి సహకారం అవసరం
– కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా రోడ్ మ్యాప్ ను రూపొందిస్తున్నాము.
– వేడుకగా నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి ప్రమాణ స్వీకారం.
– గానగంధర్వులు పద్మశ్రీ. ఘంటసాల 102వ జయంతి వేడుకలు
– కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కళలు సాంస్కృతిక వైభవాన్ని వైభవాన్ని పునరుద్ధరించటమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని, నృత్య, నాటక, సృజనాత్మకత, సాంస్కృతిక అకాడమీలతో కళారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫి శాఖామాత్యులు కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆధ్వర్యంలో విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వర రావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో గాన గంధర్వులు, పద్మశ్రీ ఘంటసాల 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఛైర్మన్ గా గుమ్మడి గోపాలకృష్ణ ప్రమాణ స్వీకారమహోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. ముందుగా కీ.శే. పద్మశ్రీ. ఘంటసాల విగ్రహానికి మంత్రి కందులు దుర్గేష్, గుమ్మడి గోపాల కృష్ణ, నాయకులు, కళాకారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఛైర్మన్ గా గుమ్మడి గోపాలకృష్ణ చేత మంత్రి కందుల దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పద్య నాటకంలో గుమ్మడితో సరితూగగల సమకాలిన నటుడు లేడని గుర్తుచేశారు. మన తెలుగు ఖ్యాతిని దేశ, విదేశాల్లో పెంపొందించారన్నారు. అసలు తెలుగు సంస్కృతిలోనే పద్య నాటకం ఒక భాగమని, రాగయుక్తంగా పద్య నాటకాన్ని ప్రదర్శించడంలో మన శైలీ ప్రపంచంలో మరే భాషకు లేదన్నారు. అంతటి విశిష్టత ఉన్న పద్య నాటకం కీర్తిని దశదిశలా వ్యాపించచేసిన గుమ్మడి గోపాలకృష్ణ మనందరికి ఆదర్శనీయుడని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గత ప్రభుత్వ హాయాంలో కళలు, సాంస్కృతిక వైభవాలు క్షీణించాయని, వాటిని మళ్లీ పునరుద్ధరించడమే మా ప్రభుత్వ లక్ష్యమని, కళాకారులకు చేయుతనందిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. కళాకారులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని, వారికి నిలిచిపోయిన పింఛన్లు మరలా పునరుద్ధరించాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు. పర్యాటక, కళా రంగాన్ని పెంచి పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, పర్యాటకులకు ఆహ్లదాన్ని అందించేందుకు కళాకారులు తమ వంతు సహకారం అందిస్తూ వస్తున్నారని ఇకపై కూడా వారి సేవలు సద్వినియోగం చేసుకుంటామన్నారు. కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా ఒక రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సమర్ధుడైన నాయకుడు ఉంటే ఆ జట్టు కచ్చితంగా విజయం సాధిస్తుందని, అలాగే నాటక అకాడమీ కి సమర్థుడైన నాయకుడు గుమ్మడి గోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించడం శుభపరిణామమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇకపై కళాకారుల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కళారంగం గొప్పతనానికి వన్నె తెచ్చిన గుమ్మడి సారధ్యంలో ఇక ఆయా రంగాలు కొత్త శోభను సంతరించుకుని నూతన కళాకారులకు కొత్త ఊపు తెస్తారని ఆశిస్తున్నానన్నారు. తొలి నాళ్లలో సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసిన నేటి సీఎం చంద్రబాబు, స్వయాన కళాకారుడైన నేటి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సాంస్కృతిక వైభవం వెలుగొందుతొందని మంత్రి కందుల దుర్గేష్ నొక్కి వక్కాణించారు. నాటక అకాడమి నూతన ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ తనకు ఛైర్మన్ గా పదవి రెండోసారి ఇవ్వడంపై సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మొదటి సారి కూడా ఇదే రోజున అంటే డిసెంబర్ 4న ప్రమాణ స్వీకారం చేశానన, మళ్లీ రెండో సారి కూడా డిసెంబర్ 4న ప్రమాణ స్వీకారం చేయడం గోప్పగా ఉందన్నారు. పూర్వం పొలం పనులు ముగిసిన తరువాత పంట విరామ కాలంలో ప్రజలందరూ ఆటలు, పాటలు, నాటకాలతో కాలక్షేపం చేశావారని గుర్తుచేశారు. మళ్లీ నాటక రంగానికి అంతటి పూర్వ వైభవం తేవడానికి తన వంతు కృషి చేస్తానని హామి ఇచ్చారు. కళాకారుడు, వారి కుటుంబ సభ్యులు కూడా గర్వంగా మేము కళాకారులం అని చెప్పుకునేలా చేస్తానని కళల ట్రైనింగ్ అకాడమీలు ఏర్పాటు చేయడంతో పాటు వారానికి కనీసం ఒక నాటకం ప్రదర్శించేలా, తద్వారా కళాకారులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హాయాంలో పద్మశ్రీ వచ్చిన కళాకారులను సైతం పిలిచి ఒక్క శాలువా కప్పిన దాఖలాలు లేవని ఎద్దెవ చేశారు. ముందుగా కీ.శే. పద్మశ్రీ. ఘంటసాల పాటల కచేరీని ఏర్పాటు చేశారు. అనంతరం నూతన ఛైర్మన్ ను మంత్రి, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావ్, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఛైర్మన్ తేజశ్వీలు, నాయకులు, కళాకారులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *