మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ మరియు ప్రభుత్వ ITI కళాశాల, గుడివాడ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.06.12.2024 శుక్రవారం గుడివాడ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr పి. నరేష్ కుమార్ మరియు గుడివాడ ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్. గౌరీమణి సంయుక్తంగా తెలియజేసారు.
కళాశాల ప్రిన్సిపాల్ ఎల్. గౌరీమణి మాట్లాడుతూ, ఉద్యోగం చిన్నదా, పెద్దదా అన్న అపోహను యువత పెట్టుకోవద్దని, ఉద్యోగం చేసుకుంటూ వెళ్తే అదే ఆ వ్యక్తులను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అని తెలిపారు.
ఈ జాబ్ మేళాలో, హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ మరియు కురాకు ఫైనాన్షియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారని వారు తెలిపారు. మొత్తంగా 38 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా, వారిలో 15 మంది ఎంపికయ్యారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ ఎల్. గౌరీమణి, కళాశాల టిపిఓ జయరాం, ఆనంద్ వేణుగోపాల్, కళాశాల సూపరింటెండెంట్ శ్రీనివాస రావు, SEEDAP సంస్థ FC మేనేజర్ బి. రాము, APSSDC సంస్థ సిబ్బంది ఎన్.నాగాంజనేయులు, పి.శేషు బాబు, కళాశాల అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.