మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం కలెక్టరేట్ విసీ హాలులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహోన్నత ఆశయాలు అనుసరణీయమని, ఆయన భారత జాతికి చేసిన సేవలు కొనియాడారు. డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, గుడివాడ ఆర్డిఓ బాలసుబ్రమణ్యం, కలెక్టరేట్ ఏవో, వివిధ సెక్షన్ల సూపర్నెంట్లు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
Tags machilipatnam
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …