గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నీటి మీటర్ల బకాయిదార్లు 2 రోజుల్లో చెల్లించకుంటే ట్యాప్ కనెక్షన్ తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ చాంబర్ లో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లతో ఆస్తి, ఖాళీ స్థల పన్ను, నీటి మీటర్ల చార్జీల వసూళ్లు వేగవంతం పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వారీగా పన్నుల వసూళ్లపై సమీక్షించి, వసూళ్లు లక్ష్యానికి తగిన విధంగా లేవని, రాబోవు రెండు రోజుల్లో వార్డ్ సచివాలయాల వారీగా అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పన్ను వసూళ్లకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలన్నారు. పన్ను వసూళ్లలో నిర్లిప్తత సరికాదని, పురోగతి లేకుంటే చర్యలు తప్పవన్నారు. నగరంలో త్రాగునీటి సరఫరాకి నగరపాలక సంస్థ నిధులు అధిక మొత్తంలో ఖర్చు చేస్తుందని, కాని నీటి పన్ను, నీటి మీటర్ల పన్ను వసూళ్లలో చాలా వెనుకబాటు ఉందన్నారు. 2 రోజుల్లో నీటి మీటర్ల చార్జీలు చెల్లించని వారి ట్యాప్ కనెక్షన్ లు తొలగించాలన్నారు. పెద్ద మొత్తంలో బకాయి ఉన్న అసెస్మెంట్ల నుండి వసూళ్ళకు రెవెన్యూ అధికార్లు చొరవ చూపాలన్నారు. మొండి బకాయిదార్ల లిస్టులు సిద్దం చేయాలని, వారి నుండి వసూళ్ల డిప్యూటీ కమిషనర్లు భాధ్యత తీసుకోవాలని, స్పందించని మొండి బకాయిదార్ల నివాసాలకు ట్యాప్, డ్రైనేజి కనెక్షన్ తొలగించదానికి చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, రెవెన్యూ అధికారులు బాలాజీ బాష, రెహ్మాన్, సాదిక్ భాష, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …