Breaking News

రెవిన్యూ సదస్సులు డిసెంబర్ 12 నుంచి జనవరి 8 వరకూ

-ప్రతి రోజు వొచ్చే అర్జీలను పి జి ఆర్ ఎస్ లో డేటా ఎంట్రీ చేయ్యాలి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
రెవిన్యూ సదస్సులకు సంబంధించిన ప్రజా ప్రతినిధులకు నియోజక వర్గ స్థాయి షెడ్యూల్ అందచేసి, వారిని భాగస్వామ్యం చెయ్యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులతో సీఎంవో ప్రాధాన్యతా కార్యక్రమాలు, డ్వామా, అంగన్వాడీ లక్ష్యాలు, నీటి పన్ను వసూళ్లు, రెవిన్యూ సదస్సులు, రెవిన్యూ అంశాలు, హౌస్ హోల్డ్ సర్వే (ఎన్ పి ఐ ) , ఎమ్ ఎస్ ఎమ్ ఈ సర్వే లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెసి చిన్న రాముడు మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రెవిన్యూ సదస్సులను డిసెంబర్ 12 నుంచి జనవరి 8 వరకూ నిర్వహించ తలపెట్టినట్లు తెలియ చేశారు. ఈ సదస్సులకు సంబంధించిన క్షేత్ర స్థాయిలో ప్రచారం చెయ్యాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం తో పాటు మండల స్థాయి లో జరిగే షెడ్యూల్ అందచేసి వారి కూడా పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటి రెవిన్యూ అధికారులు గ్రామ పంచాయతీల పరిధిలో, పట్టణ ప్రాంతాలకు చెందిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. గ్రామ రెవెన్యూ సదస్సులకు హాజరైన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం, వాటినీ ఎప్పటి కప్పుడు పి జి ఆర్ ఎస్ పోర్టల్ లో అప్లోడ్ చెయ్యాలని జెసి చిన్న రాముడు పేర్కొన్నారు. ఏ రోజుకు ఆరోజు వొచ్చిన అర్జీలపై సమీక్ష నిర్వహించడం ద్వారా వాటికీ పరిష్కార మార్గం చూపాల్సి ఉంటుందన్నారు. సదస్సుల నిర్వహణా, అర్జీలు స్వీకరణ, డేటా ఎంట్రీ నమోదు తదితర అంశాలపై శిక్షణాకార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు తెలిపారు.  ఉపాధిహామీ పథకం కింద జిల్లాకు చెంది డిసెంబర్ నెల వరకూ 44 లక్షల పని దినాలు లక్ష్యం కాగా 41.70 లక్షలు (95%) సాధించడం జరిగిందని తెలిపారు, తక్కువ ప్రగతి సాధించిన మండల స్థాయి అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బంది చే నూరుశాతం సాధించాల్సి ఉంటుందనీ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ, ట్రీ గార్డెన్, మౌలిక సదుపాయాలు కల్పించడం పై సూపర్వైజర్ లకి చెందిన లక్ష్య సాధనలో మెరుగైన ఫలితాలు సాధించిన మండల స్థాయి అధికారులు నుంచి స్ఫూర్తి పొందాలని పేర్కొన్నారు. హౌస్ హోల్డ్ సర్వే, ఎమ్ ఎస్ ఎమ్ ఈ సర్వే ల ప్రగతి పై జెసి మండల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డి ఆర్వో టి సీతారామ మూర్తి, కే ఆర్ ఆర్ సి ఎస్డిసి ఆర్ భాస్కర్ రెడ్డి, ఇతర సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *