-సెంటర్ అడ్మినిస్ట్రేటర్, సైకో-సోషల్ కౌన్సెలర్ పోస్టుల భర్తీ
-ఐసీడీఎస్ పీడీ జి. ఉమాదేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యములో నడపబడుచున్న వన్ స్టాప్ సెంటర్ నందు ఖాళీగా ఉన్న ఒక సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పోస్టును, సైకో-సోషల్ కౌన్సెలర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారిణి ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. పై పోస్టులను భర్తీ చేసేందుకు గతంలో నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ లు నిర్వహించడం జరిగిందన్నారు. ఇంటర్వ్యూ లకు హాజరైన అభ్యర్థులు అర్హత సాధించినందున తిరిగి మరల నోటిఫికేషన్ జారీచేయడటం జరిగిందని ఆమె తెలిపారు. పైన తెలిపిన సెంటర్ అడ్మినిస్ట్రేటర్, సైకో-సోషల్ కౌన్సెలర్ పోస్టులను కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయటం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండి 42 సంవత్సరాలలోపు వయస్సు కలిగి స్థానిక మహిళా అభ్యర్ధులు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ వర్గాలకు చెందిన మహిళలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల గరిష్ట వయస్సు సడలింపు ఉంటుందన్నారు.
పై పోస్టులకు అర్హత కలిగి ఆసక్తి గల మహిళ అభ్యర్థులు డిసెంబర్ 10వ తేది నుండి 18వ తేది లోపల దరఖాస్తు చేసుకోవాలన్నారు. సదరు దరఖాస్తులను అభ్యర్థులు ntr.ap.gov.in వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ధరఖాస్తును పూర్తి చేసి ధ్రువపత్రాల నకళ్ళను గజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయము, డోర్ నెంబర్ 6-93, కార్మెల్ చర్చి ఎదురురోడ్, కానూరు, విజయవాడ వారి కార్యాలయమునకు అభ్యర్ధులు స్వయముగా అందజేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు.