అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు ఎంపి స్థానాల భర్తీకి సంబంధించి టిడిపి అభ్యర్ధులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బిజెపి తరుపువ ఆర్.కృష్ణయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి వద్ద రాజ్యసభ ఎంపి అభ్యర్ధులుగా వారు నామినేషన్లను దాఖలు చేశారు. మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు అభ్యర్ధులే నామినేషన్ల దాఖలు చేయడంతో నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణల గడువు అనంతరం వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్ధులు తరపున ఆయా పార్టీల ప్రతినిధులుగా రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంధ్ర, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కె.అచ్చన్నాయుడు, పి.నారాయణ, పలువురు ఎంఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …