Breaking News

జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి… అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు

-కాజ్వేలు,వంకలలో నీరు ప్రవహిస్తున్న సమయంలో ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దు
-ఎటువంటి ప్రాణం నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ఎలాంటి విపత్తునైన ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంది
-జిల్లా కలెక్టరేట్ లో మరియు మండల,డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007
-జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరియు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు ప్రయాణాలు చేయవద్దని, కాజ్వేలపై నీరు ప్రవహిస్తున్న సందర్భంలో పొరపాటున కూడా దాటరాదనీ, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎటువంటి ఆస్తి నష్టం, మానవ, పశు ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టి ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తెలుపుతూ జిల్లా కేంద్రంలో, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసామని, సంబంధిత అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో, పట్టణాలలో పర్యటించి డ్రైనేజీ కాలువలు ఎక్కడైనా బ్లాక్ అయిన వాటిని క్లియర్ చేయాలని, ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని, కోస్తా తీర ప్రాంతాల్లో మత్స్యకారులను అప్రమత్తం చేసి సముద్రంలోకి వేటకు వెళ్లకుండా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. అధికారులందరూ 24/7 వారి ప్రధాన కార్యస్థానం నందు అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి అప్రమత్తం చేయాలని సూచించారు. కోస్తా తీర ప్రాంతాలైన గూడూరు డివిజన్ కోట, చిల్లకూరు, వాకాడు మండలాలు, సూళ్లూరుపేట డివిజన్ నందు తడ తదితర మండలాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా జెసి అధికారులకు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

చెరువులు, కాలువల వెంబడి అధికారులు పర్యటించి కరకట్టలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.

కాజ్ వే లపై నీరు ప్రవహిస్తుంటే దాటడానికి అనుమతించరాదని ఇరువైపుల రోపులను కట్టి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీస్, గ్రామ సచివాలయసిబ్బంది,ఆర్ అండ్ బి పంచాయితీ రాజ్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఎలాంటి విపత్తును అయినా ఎదుర్కునేందుకు అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నామని, భారీ వర్షాల నేపథ్యం లో తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో మరియు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని ఏదైనా సహాయం, సమాచారం కోసం క్రింది నెంబర్లను సంప్రదించాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

కలెక్టరేట్ తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007

గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9849904062

సూళ్లూరుపేట ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9441984020

తిరుపతి ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 7032157040

శ్రీకాళహస్తి ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 6281156474.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *