Breaking News

స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటరీని ఆవిష్కరించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

-విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం
-స్ధానిక ఆనం కళా కేంద్రంలో జిల్లా స్థాయి కార్యక్రమానికి ఏర్పాట్లు
-విజయవాడ నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరు ప్రశాంతి దిశా నిర్దేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర విజన్ 2047, వికసిత భారత్ 2047 దిశగా డాక్యూమెంటరీ రూపకల్పన నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం లో ఒక కేటగిరిలో ప్రముఖులు, ఇంకో కేటగిరిలో విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంధ సంస్థలు, స్టార్టప్, విభిన్న రంగాల్లో ప్రతిభా వంతులు, వివిధ కమిటీలలో సభ్యులు, మూడో కేటగిరిలో స్థానికులుతో మేధోమధన కార్యక్రమం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. గురువారం విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డిఆర్వో టి సీతారామ మూర్తి, సిపివో ఎల్. అప్పలకొండ, ఆర్డీవో రాణి సుస్మిత, ఆర్ కృష్ణ నాయక్ లు , యితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా నుంచి మూడు కేటగిరి ల కింద ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందని కలెక్టరు ప్రశాంతి తెలియ చేశారు.

ప్రముఖ వ్యక్తులు, విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంధ సంస్థలు, రైతుల ఉత్పత్తి సంస్థ ప్రతినిధులు, అభ్యుదయ రైతులు, స్టార్టప్ విభిన్న రంగాల్లో అభివృద్ధి చూపే వ్యక్తులు , స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులు, ప్రజల, మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించే దిశలో పనిచేసే వ్యక్తులు, సంస్ధల ప్రతినిధులు భాగస్వామ్యం తో కూడిన మూడు బృందాలను విజయవాడ పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. అదే విధంగా జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. స్ధానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆమేరకు ఏర్పాట్లు చెయ్యాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులను, శాసన మండలి సభ్యులను, శాసన సభ్యులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమం కి హాజరు కాలేని ప్రజా ప్రతినిధులు జిల్లా స్థాయి కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని, ఆమేరకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. అదే విధంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులును మునిసిపల్ కమిషనర్ లు, తహశీల్దార్లు ఆహ్వానించాలన్నారు. ఈ ఇన్విటేషన్లు ప్రతి ఒక్కరికీ వాట్సాప్ ద్వారా అందచేసి,ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు.

రెవిన్యూ, ప్లానింగ్, వ్యవసాయ, జిల్లా గ్రామీణాభివృద్ధి, మునిసిపల్, విద్యా శాఖ, పరిశ్రమలు తదితర శాఖల అధికారులు సమన్వయం చేసుకోవడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కలెక్టరు పేర్కొన్నారు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *