Breaking News

రాజమహేంద్రవరం  విమానాశ్రయం అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా..

-ఇండిగో విమాన సర్వీస్ ఉదయం 9.00 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంది.
-నియమాలను అనుసరించి ఎయిర్ బస్ కు నీటిని వెదజల్లి స్వాగతం పలకడం జరిగింది
-2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సారధ్యంలో గత పదేళ్ళ లో 158కి పెంచుకున్నాం.
-రాబోయే ఐదేళ్లలో మరో 50 ఏర్పోర్టులు నిర్మాణ దిశగా చర్యలు.
-రాజమహేంద్రవరం నుండి న్యూఢిల్లీ  వరకు నూతన ఎయిర్ బస్సును ప్రారంభించిన..
-కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం విమానాశ్రయం అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం (మదురుపూడి) విమానాశ్రయం నుండి న్యూఢిల్లీ వరకు ప్రయాణించే నూతన ఎయిర్ బస్సును కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి , కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, రుడా చైర్మన్ వెంకట రమణ, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామ కృష్ణ, జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఎపిడీ ఎస్. జ్ఞానేశ్వర్ లతో కలిసి విమాన నూతన సర్వీసును ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి  కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి నూతనంగా  నేరుగా విమాన సౌకర్యాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజమండ్రి ప్రజల చిరకాల వాంఛ.. ఢిల్లీకి నూతన విమాన సర్వీస్ ప్రారంభ సమయంలో నేరుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి మీతో ఈ సంతోషాన్ని పాలుపంచుకొని ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమిలో  ప్రధానమంత్రి నేతృత్వంలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ది కోసం ముందుకు నడుస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నూతన ఎయిర్ పోర్టులకు ప్రతిపాదనలు, ఇప్పటికే ఉన్న ఎయిర్పోర్టులకు మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాలు నుండి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి దిశగా సాగుతున్నామన్నారు.

స్థానిక ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అభ్యర్థన మేరకు దేశ రాజధాని ఢిల్లీకి ఈరోజు ఎయిర్ బస్ సర్వీసులు ప్రారంభించుకుంటున్నా మన్నారు. అదేవిధంగా   డిసెంబర్ ఒకటో తేదీన రాజమండ్రి నుండి వాణిజ్య   కేంద్రమైన ముంబాయికినేరుగా విమానయాన సర్వీసు ప్రారంభించుకున్నామని తెలిపారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలకు  అంతర్జాతీయంగా దూరప్రాంతాలకు ప్రయాణించేందుకు  ఈ ఎయిర్ బస్ ఏర్పాటు వలన ఎంతో సమయం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్ నగరాలకు కనెక్టివిటీ ఉందన్నారు. రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయంలో నూతన టెర్మిల త్వరలో ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో కి తీసుకురానున్నామన్నారు. రాజమండ్రి నుండి తిరుపతి తో పాటు గుజరాత్ లోని అహ్మదాబాద్ , జైపూర్ , వారణాసి, షిర్డీ వంటి నగరాలకు కూడా విమాన సౌకర్యాన్ని కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి రాజమండ్రి, విజయవాడ , కడప ఎయిర్ పోర్ట్ ల నుండి   నూతన ఎయిర్ బస్సులను ప్రారంభించుకున్నామన్నారు..ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నూటికి నూరు శాతం కృషి చేస్తానన్నారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ. సారధ్యంలో గత పదేళ్ళ లో 158 విమానాశ్రయాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. మరో ఐదు సంవత్సరాలలో దేశంలో 50  నూతన ఎయిర్ పోర్ట్ లను నిర్మించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో ఆలోచనలు చేస్తున్నామన్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు అమెరికా వంటి అంతర్జాతీయ సర్వీస్ లను వినియోగించుకోవాలంటే వారు విశాఖపట్నంలో విజయవాడ వెళ్ళవలసిన అవసరం లేదని, రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన  న్యూఢిల్లీ, ముంబై సర్వీస్ లో ద్వారా తమ ప్రయాణి మార్గాలు  సులభమై  సమయం ఆదా అవుతుందన్నారు. 180 మంది కూర్చుని ప్రయాణం చేసే ఎయిర్ బస్సులు ప్రారంభించుకుంటున్నామని దీనివలన రెవెన్యూ కూడా పెరుగుతుందన్నారు. దేశంలోచిన్న చిన్న నగరాల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎయిర్ పోర్ట్ లో అభివృద్ధి జరిగిందన్నారు. డబ్బు కంటే సమయం చాలా విలువైనదని వ్యాపారవేత్తలు ఎందుకు అనుగుణంగా ఎక్కువమంది ఎయిర్ ట్రావెల్ వినియోగిస్తున్నారు.
రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. మొట్టమొదటి అడుగుగా రాజమండ్రి నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి నూతనంగా ఎయిర్ బస్ సౌకర్యాన్ని కల్పించిన ప్రథాన మంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. త్వరలో గోదావరీ పుష్కరాలు రానున్న నేపథ్యంలో రాజమహేంద్రవరానికి యావత్ భారతదేశంతో  విమాన సర్వీసులను  అవసరమయ్యే  ఆవశ్యకత  ఉందన్నారు.
ఆ దిశగా రాజమహేంద్రవరం నుండి తిరుపతి, వారణాసి ,షిరిడి వంటి నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా కేంద్ర మంత్రి  రామ్మోహన్ నాయుడు కృషి చేయాలని ఎంపీ సూచించారు. రాజమహేంద్రవరం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని  ఈ ప్రాంత వాసులు  ఉద్యోగ, వ్యాపార రీత్యా విమాన ప్రయాణ సౌకర్యం  కల్పించడం వల్ల  ఆర్థికంగా   బలోపేతం చెందుతుందన్నారు.  డబుల్ ఇంజన్ సర్కార్ వలన  అమరావతి అభివృద్ధికి, పోలవరం  ప్రాజెక్టు నిర్మాణానికి, రహదారుల మరమత్తులకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులకు సహకారం కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు. నేడు సివిలైజేషన్ మాధ్యమంగా  రాష్ట్రానికి ఎంతో సహకారాన్ని  కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవి గారు అమరావతికి సంబంధించిన రైల్వే లైన్లు కూడా  ఇప్పటికే ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు.  రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ కు నూతన సర్వీసును ప్రారంభించుకు నేందుకు అడిగిన వెంటనే అందుబాటు లోకి తీసుకు వచ్చిన  కేంద్ర విమానయాన శాఖ మంత్రి కేంద్రమంత్రి రామ్మోహన్ రాయుడు గారికి,  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి , కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, రుడా చైర్మన్ వెంకట రమణ, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామ కృష్ణ, జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు , ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఎపిడీ ఎస్. జ్ఞానేశ్వర్ ఆర్డీవో కృష్ణనాయక్, ఎయిర్పోర్ట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *