-దొమ్మేరు రెవిన్యూ సదస్సు లో 30 అర్జీలు
-కొవ్వురు ఆర్డిఓ రాణి సుస్మిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామస్థాయిలో భూ వివాదాల పరి ష్కారానికి రెవె న్యూ సద స్సులు ఉ పయోగపడతాయ ని కొవ్వురు ఆర్డి ఓ రాణి సుస్మి త అన్నారు. దొమ్మేరు గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సులో సుస్మిత పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆర్డీవో సుస్మిత మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు భూ వి వాదాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి ఎలాంటి రుసుమూ ఉండదని తెలిపారు. సమస్యల పరిష్కార మార్గం కోసం మండల కేంద్రంలో అందుబాటులో ఉంటామని, ఎప్పుడైనా వొచ్చి మీ అర్జీ ఇవ్వ వచ్చు అని పేర్కొన్నారు. వ్యయ ప్రయాసలకోర్చి రాజమండ్రి కలక్టరేట్ కు రావడం జరుగుతోందని, ఇకపై ఇక్కడే మీ అర్జీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 33 రోజుల్లో భూ వివాదాలు కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నా రు. రెవెన్యూ సదస్సుల్లో వివిధ అర్జీ ల పరిష్కా రాన్ని రోజువారీగా పరిశీ లన చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ సమస్యలు పరిష్కార చర్యలు తీసుకున్నట్లు బాధితు లకు తెలుగులోనే రసీదు, తిరుగు సమాధానం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామస్థాయిలో భూ వివాదాల పరి ష్కారానికి, 22A, ఫ్రీ హోల్డ్, భూ ఆక్రమణ లకు సంబంధించిన ఫిర్యాదు లను, వివిధ సమస్యల పరిష్కారా నికి రెవెన్యూ సదస్సులు ఉపయో గపడతాయని తెలిపారు. మండల స్థాయి అధికారులు రెవె న్యూ సదస్సుల్లో అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని ప్రజలు, రైతులు ఉపయోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల డిప్యూటి తాహిసిల్దార్, ఎం. దుర్గాప్రసాద్, మండల ఎండోమెంట్ ఆఫీసర్, ఎం సూర్య ప్రకాష్ రావు, రీ సర్వే డిటి, ఎస్. కృ ష్ణ, సర్పంచ్ తానేటి కుమారి, ఎంపీ టీసీ, హెచ్. సరోజినీ, ఆర్ ఐ, బి. వి శ్వేశ్వర రావు, పెండ్యాల శివరామ కృష్ణ, బాబురావు, కే . పకీర్, వీ ఆర్వో లు, టి. సుబ్రమణ్యం, షేక్ హుస్సేన్, కె.వి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.