విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ లోని 51,52,53 డివిజన్ల మండల అధ్యక్షులు పంచిపిళ్ళ హరి నారాయణ, జగ లింకి రామకృష్ణ, అడ్డూరి ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో కోమల విలాస్ ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి ) ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ దేశానికి సుపరిపాలనను పరిచయం చేసిన పరిపాలనాదక్షుడు వాజ్పేయి అని కొనియాడారు. వాజ్పేయి పాలనా కాలంలో ఊపిరి పోసుకున్న స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్, టెలికాం, పోర్టుల వంటి ఆనేక కీలక సంస్కరణలను అమలు చేశారన్నారు. ఆయన దూరదృష్టితో నిర్మించిన నాలుగు లైన్ల రహదారులు, దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయన్నారు. ప్రతి ఒక్కరూ వాజ్పేయిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం స్థానిక బూత్ కమిటీ మీటింగ్లో పాల్గొని వివిధ డివిజన్ ల అధ్యక్షులను ఎన్నుకొన్నారు. అనంతరం స్థానికులకు ఆపిల్ పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్,బోగవల్లి శ్రీధర్, పోతిన బేసుఖంటేశ్వరుడు, ఆవ్వారు బుల్లబ్బాయి, వేరుకొండ ఉమాకాంత్, పైలా సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …