-చంద్రబాబు బీసీల పక్షపాతి
-బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రబాబు బీసీల పక్షపాతి అని నిరూపించుకున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కాన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ… బీసీల ఫెడరేషన్ లు ఏర్పాటు చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావుది. నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి బీసీలకు పెద్దపీట వేశారు. అన్న నందమూరి తారక రామారావు బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. ఎన్టీరామారావును స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు నాయుడు కూడా బీసీలకు పెద్దపీట వేశారు.
జగన్ అధికారంలోకి రాక ముందు నా బీసీలు, నా బీసీలు అని గొంతు చించుకొని చెప్పి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత రంగులు మార్చాడు. జగన్ వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత యువతను మోసం చేశాడు. జగన్ తన హయాంలో నా బీసీలు అని చెబుతూ హాస్టళ్లలో కనీస నిర్వహణ కోసం నిధులు ఇవ్వలేదు. చంద్రబాబు బీసీలను అక్కున చేర్చుకున్నారు. నా బీసీలు అని చెప్పిన వైసీపీ హాస్టల్ విద్యార్థులకు మినిమం మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేదు. జగన్ ది అసమర్థ పాలన అయితే.. చంద్రబాబుది కార్యాచరణ పాలన. జగన్ కార్పొరేషన్ లు ఏర్పాటు చేశారు గానీ ఆ కార్పొరేషన్ కార్యాలయాల్లో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. మేం అధికారంలోకి రాగానే కార్పొరేషన్ లకు నిధులు, విధులు కేటాయించాం. ప్రతి ఒక్కరిని వ్యాపారవేత్తలుగా తయారు చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సీడ్ యాప్ ద్వారా పది వేల మందికి ఉపాధి చూపించబోతున్నాం. పౌల్టీ, సీఫారమ్స్, మెడికల్ స్టోర్స్, ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ లలో యువతకు ట్రైనింగ్ ఇచ్చి వారు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ కూడా ప్రభుత్వమే చేసే విధంగా ప్రణాళిక రచించాం. దీంతో పది వేల మందికి లబ్ది చేకూరనుంది. ఈ కార్యక్రమం జనవరి నుంచి మొదలుకానుంది. సీప్ ఛైర్మన్ దీపక్ రెడ్డి తో ఈ విషయాలను చర్చించాం. సెంచీరియన్ యూనవర్శిటీవారి వద్ద నుండి సూచనలు, సలహాలు తీసుకున్నాం. స్థానిక ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ పై కూడా చర్చించాం. ఇదొక మంచి ప్రభుత్వం అనడానికి మేం చేసిన మంచి పనులే నిదర్శనం. ఎన్డీయే చెప్పిన మాట నిలబెట్టుకుంది. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేస్తామన్నాం, చేశాం. ఉచిత ఇసుక అన్నాం ఇస్తున్నాం. అన్నా క్యాంటిన్లను ప్రారంభిస్తామన్నాం. ప్రారంభించాం. జగన్ భూ చట్టాన్ని రద్దు చేస్తామన్నాం. చేశాం. అభివృద్ధే ధ్యయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు కేటాయించే 34 శాతాన్ని వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించింది. బీసీలు రాజకీయంగా ఎదగకూడదనేదే జగన్ ధ్యేయం. చంద్రబాబు, బీసీ మినిష్టర్ లతో సమావేశం ఏర్పాటు చేసి బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు పరచే విషయంపై కార్యాచరణ చేపట్టడంపై కూడా చర్చించాం. బీసీలకు 39,700 కోట్లు నిధులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీయే కూటమి ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం చేసింది. కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు కానీ కార్పొరేషన్లలో కూర్చోవడానికి కూర్చీలు కూడా లేకుండా చేశారు. టీడీపీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి నిధులు విధులు కేటాయించింది. ఈ ఆరు నెలల కాలంలోనే బీసీలకు పెద్దపీట వేశాం. మహాత్ముడు జ్యోతిరావు పూలే బీసీలకు దేవుడు లాంటివాడు. మహాత్మ జ్యోతిరావుపూలే పేరుతో స్కూళ్లు, హాస్టళ్లు పెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా 107 స్కూళ్లు ఉంటే 105 స్కూళ్లను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే తీసుకొచ్చాం. 2014-19లో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నప్పటికి బడుగు, బలహీన వర్గ ప్రజల పిల్లలు చదువుకోవాలన్నదే చంద్రబాబు లక్ష్యం. కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు ఉండాలన్నదే చంద్రబాబు ఉద్దేశం. అనేక చోట్ల హాస్టళ్లను ఏర్పాటు చేసి వారికి మంచి విద్యనందిస్తున్నాం. గత ప్రభుత్వం రంగులు మార్చుకోవడానికి, పేర్లు మార్చుకోవడానికే సరిపోయింది. బీసీ బిడ్డలు చదువుకోవడం కూడా వైసీపీ నాయకులకు ఇష్టంలేదు. టీడీపీ హయాంలో నిర్మాణాలు చేపట్టిన స్కూల్ భవనాలు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అసంతృప్తిగా ఉన్నాయని రివ్యూ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. వెంటనే ఆ స్కూళ్లను పూర్తి చేసేందుకు రూ. 85 వేల కోట్ల నిధులు కేటాయించారు. గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం బీసీ హాస్టళ్ల పరిస్థితిని దారుణంగా మార్చింది. మెయింటెనెన్స్ నిధులు లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు. రన్నింగ్ వాటర్ లేక వాష్ రూమ్స్ సరిగ్గా లేక, లైట్లు, ఫ్యాన్లు సరిగా లేక, బిల్డింగ్ లీకేజీలతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లగా అందుకు కూడా నిధులు కేటాయించారు. బీసీ హాస్టల్ విద్యార్థులకు డైట్ బిల్ కోసం బడ్జెట్ కంటే అదనంగా రూ. 45 కోట్ల నిధులు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం డైట్ చార్జీలను కూడా పెండింగ్ పెట్టి పోయింది. దీన్ని కూడా ఇటీవల చంద్రబాబు నిధులను విడుదల చేశారు. రూ. 135 కోట్లు డైట్ ఛార్జీలకు కేటాయించారు. ఇంకా రూ. 45 కోట్ల 55 లక్షలు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కాస్మోటిక్ చార్జీలు ఇవ్వకుండా ఆపేసింది. చంద్రబాబు బడ్జెట్ లో రూ.11 కోట్లు కేటాయించగా అదనంగా 21 కోటి 60 లక్షలు మంజూరు చేశారు. వైసీపీ హయాంలో ట్యూటర్లకు జీతాలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు, ట్యూటర్లు పడుతున్న ఇబ్బందులను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లాం. అందుకు కూడా ఆయన అదనంగా రూ.3 కోట్ల 20 లక్షల రూపాయలు నిధులు కేటాయించారు. బిసి వేల్ఫేర్ ద్వారా 6 వేల మంది విద్యార్థులు డిఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు. సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ను కూడా ప్రారంభించాం. వంద మంది సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ ప్రిన్యుర్ ను తయారు చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం. మహిళా పక్షపాతి చంద్రబాబు. ఇడబ్ల్యుఎస్ తరపున 175 నియోజకవర్గాల్లో 80 వేల మందికి ఉచిత శిక్షణ ఇస్తూ వారికి కుట్టు మిషన్లు కూడా ఇవ్వబోతున్నాం. మహిళల్లో ఎంపోర్ మెంట్ తయారు కావాలి. వారి కాళ్ల మీద వారు నిలబడాలన్నదే చంద్రబాబు అభిలాష. ఈ బడ్జెట్ లోనే ఈ పనులన్నీ చేయదలిచాం. పౌల్ట్రీ, పాడిపరిశ్రమ అభివృద్ధికి బడ్జెట్ లో నిధులు కేటాయించడం జరిగింది. ఎవరైనా వ్యాపారం చేయదలచుకున్నవారికి ఎంఎస్ ఎంఈ ద్వారా సబ్సిడీ లోన్లు ఇస్తూ వారిని ప్రోత్సహించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వెయ్యి జనరిక్ మెడికల్ షాపులు విడుదల చేస్తున్నాం. పౌల్ట్రీ ఫామ్లు, షీ ఫామ్ లు ఏర్పాటు చేసి బీసీలను అన్ని విధాల ఆదుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత వివరించారు.