విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవాని దీక్ష విరమణ సందర్భంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో గొల్లపూడి మైలురాయి సెంటర్ వద్ద నుండి ఇన్నర్ రింగ్ రోడ్డు మీదగా ట్రాఫిక్ ను మళ్ళించడం జరిగింది. ఈ క్రమంలో రామవరపాడు రింగ్ సెంటర్ ఏరియాలో విపరీతంగా రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తాత్కాలికంగా వాహనాలను విజయవాడ లోనికి రాకుండా గొల్లపూడి నుండి పశ్చిమ బైపాస్ మీదుగా మల్లించడం జరిగింది. పశ్చిమ బైపాస్ రోడ్డు ఇంకా మరమ్మతుల్లో ఉన్న నేపథ్యంలో వాహనదారులు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని తగు సూచనలతో ఉన్న బోర్డు లను ఏర్పాటు చేసి వాహనాదరులను మల్లించడం జరిగింది.
రానున్న నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగలు నేపథ్యంలో నగరంలో మరింత వాహన రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ లో దీని తగ్గించడానికి పశ్చిమ బైపాస్ ను ఉపయోగించాలని ఆలోచనతో ఈ రోజు ది.24.12.2024 న పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., ట్రాఫిక్ ఏ. డి.సి.పి శ్రీ ఎ.వి.ఎల్. ప్రసన్న కుమార్, ట్రైనీ ఐ. పి. ఎస్. వి మనీషా, గన్నవరం ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్ మరియు మేఘా కన్స్ట్రక్షన్ లైజన్ ఆఫీసర్ మురళి లతో కలిసి చిన్న అవుటపల్లి నుండి గొల్లపూడి వరకు గల పశ్చిమ బైపాస్ రోడ్డును పరిశీలించి పెండింగ్ ఉన్న పశ్చిమ బైపాస్ పనుల గురించి విచారించి పోలీస్ తరుపున ఏమైనా చేయవలసిన సహాయం అందించడం జరుగుతుందని, త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.