విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సురక్షిత, ప్రమాద రహిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ అదే విధంగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై మరియు వాహనాధారులలో హెల్మెట్ పై అవగాహన కల్పించేందుకు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు ట్రాఫిక్ డి. సి. పి కృష్ణ మూర్తి నాయుడు పర్యవేక్షణలో ట్రాఫిక్ మరియు లా & ఆర్డర్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి నగరంలోని అన్ని ముఖ్య ప్రదేశాలలో వాహనదారులపి విస్తృతంగా తనిఖీలను నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో హెల్మెట్ ధరించని వాహనదారులను హెల్మెట్ వలన ఉపయోగాలను గురించి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న జరిమానాలను వెంటనే చెల్లించాలని, మీ ఫోన్ లోనే జరిమానాలు చెల్లించవచ్చు అని తెలియజేస్తూ హెల్మెట్ పెట్టుకోకపోతే జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలియజేసారు. ఈ రోజు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ ద్వారా పెండింగ్ చలానాలు, హెల్మెట్ ధరించని 1651 మంది వ్యక్తుల వద్ద నుండి 6,33,490/- రుసుము కలెక్ట్ చేయడం జరిగింది. పెండింగ్ చలాన్ లను https://echallan.parivahan.gov.in/index/accused-challan లింక్ ద్వారా చెల్లించవచ్చు మరియు పెండింగ్ చలానాలు ఉన్న అందరికి మెసేజ్ లను పంపడం జరిగింది. ఆ మెసేజ్ లలో ఉన్న లింక్ ఓపెన్ చేసి అయినా కట్టచ్చు. అదే విధంగా అన్ని పోలీస్ స్టేషన్స్ నందు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. వాహనదారులు తమకు విధించిన చలాన్ లను 90 రోజులలో చెల్లించని యెడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది.
ఈ క్రమంలో సచివాలయ మహిళా పోలీస్ సిబ్బందితో హెల్మెట్ వలన ఉపయోగాల గురించి మరియు పెండింగ్ చలానాలను వారి వారి ఫోన్ల ద్వారా చెల్లించే విధానంపై అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిదిలో మైక్ అనౌన్సుమెంటు చేయించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం లో కీలకంగా వ్యవహరించి అత్యధిక చలానాలను వసూలు చేసిన అజిత్ సింగ్ నగర్ ఇన్స్పెక్టర్ బి. హెచ్ వెంకటేశ్వర్లు ని, కృష్ణలంక ఇన్స్పెక్టర్ ఎస్.ఎస్.ఎస్.వి.నాగరాజు ని మరియు గ్రామ సచివాలయ మహిళా పోలీసులలో అజిత్ సింగ్ నగర్ పి. ఎస్. కు చెందిన పి. గాయత్రి మరియు కృష్ణలంక పి. ఎస్. కు చెందిన ఎం. రాజేశ్వరి లను పోలీస్ కమీషనర్ అభినందించారు. కావున మోటార్ సైకిల్ వాహనాధారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనదారులందరు రహదారి భద్రత నియమాలు పాటించి పోలీస్ వారికి సహకరిస్తారని ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., కోరారు.