-అభినందనలు తెలిపిన శాప్ ఛైర్మన్ రవినాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ జమ్మూలో జరిగిన 37వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. సబ్-జూనియర్స్ విభాగంలో ద్వితీయ, తృతీయ స్థానాలను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. రెండవ స్థానంలో బాలికల జట్టు, మూడవ స్థానంలో బాలుర జట్టు విజయం సాధించడం పట్ల శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు గారు అభినందనలు తెలియజేశారు. జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటి రాష్ట్ర ఖ్యాతిని పెంచడం సంతోషదాయకమని హర్షించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, శాప్ నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.