విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ ఆధ్వర్యంలోని గొలగాని చారిటబుల్ ట్రస్ట్ (జిసిటి) ద్వారా ప్రారంభించిన “తిరుమల తిరుపతి యాత్ర సేవ” పథకం ద్వారా ప్రతినెల పేద భక్తులకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం నిమిత్తం విజయవాడ నుంచి తిరుపతి వెళ్లి వచ్చుటకు ప్రయాణ ఖర్చులు అందజేస్తున్నారు. ఈ పథకం లో మొదటి సారిగా 18 మంది భక్తులకు రైల్వే ప్రయాణ టికెట్స్ రిజర్వేషన్ టికెట్స్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలోని వారి ట్రస్ట్ కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది.
స్థానిక తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి, మాజీ కార్పొరేటర్ పల్లా దుర్గాంబ, బీసీ నాయకులు నమ్మి అప్పారావు, జానపద గాయకులు ఉపాధ్యాయులు దామోదర గణపతి రావు చేతుల మీదుగా ఈ టికెట్స్ పంపిణీ జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ గొలగాని రవి కృష్ణ ఎంతో భక్తి భావంతో పేద భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించారని, పేద భక్తులకు విజయవాడ నుంచి తిరుపతికి వెళ్లి వచ్చుటకు రైల్వే టికెట్స్ రిజర్వేషన్ చేయడం ఎంతో అభినందనీయం అని పేద భక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని తెలిపారు. మాజీ కార్పొరేటర్ పల్లా దుర్గమ్మ మాట్లాడుతూ గొలగాని రవికృష్ణ అన్నదానాలు విద్యా దానం లాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటారు అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు వారికి చెందాలని తెలిపారు.