Breaking News

ఏపీఎంఐపి, ఉద్యాన వన శాఖలు నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యానవన శాఖ, ఏపీఎంఐపి వారు రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పించి వార్షిక లక్ష్యాల మేరకు పురోగతి ప్రణాళిక బద్ధంగా సాధించాలని, ఆ దిశగా అధికారుల పనితీరు ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నందు ఉద్యాన శాఖ అధికారులు, ఆంధ్ర ప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రాం (APMIP) అధికారి, వారి సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్య సాధన దిశగా, రైతులకు మేలు చేకూర్చేలా జిల్లాలో సదరు శాఖలు పని చేయాలని సూచించారు. ఉద్యాన శాఖ వారు 15% గ్రోత్ రేట్ హార్టికల్చర్ లో వచ్చేలా ప్రణాలికలు, ఆయిల్ పామ్ నిర్దేశిత లక్ష్యాల సాధన, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి మరియు పంపిణీ హార్టికల్చర్ ద్వారా రైతులకు అందించేలా ఉండాలి అన్నారు. క్రాప్ డైవర్సిఫికేషన్ పై దృష్టి సారించాలని సూచించారు. గ్రోత్ ఇంజిన్ లలో మనకు మామిడి, యాసిడ్ లైమ్ రెండు కూడా ఫోకస్ అని జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి తెలిపారు. ఉద్యాన శాఖ అధికారులు సక్రమంగా ఎంఐడిహెచ్ పథకాలు మరియు ఆర్కేవివై పథకాల ద్వారా హైబ్రిడ్ కూరగాయల పంటలు విస్తరణ పథకం మరియు పూల సాగు విస్తరణ పథకం పై మరింత దృష్టి సారించి పురోగతి సాధించాలని అన్నారు. మెకనైజేషన్ పై ప్రత్యేక దృష్టి సారించి, రైతు ఉత్పత్తి దారుల సంఘాలను త్వరగా ఏర్పాటు చేయించాలని ఉద్యాన శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అధికారులు సిబ్బంది తమ లక్ష్యాలను తప్పక సాధించాలని, ఎలాంటి అలసత్వం ఉన్నా చర్యలు తప్పక ఉంటాయని అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రాం (APMIP) అధికారి సతీష్ వివరిస్తూ తక్కువ నీటితో ఎక్కువ పంట దిగుబడి కి స్ప్రింక్లర్లు, డ్రిప్ మెటీరియల్ సబ్సిడీ తో ప్రభుత్వ నిబంధనల మేరకు అందిస్తున్నామని వివరించారు. రెయిన్ పోర్ట్ మెటీరియల్ వాడకం వేరుశెనగ పంటకు ఎక్కువగా ఉపయోగ కరంగా ఉంటుందని, తదనుగుణంగా దానిని ప్రమోట్ చేస్తున్నామని తెలిపారు. బొప్పాయి, మామిడి, యాసిడ్ లైమ్ తదితర పంటలు జిల్లాలో పండిస్తున్నారని తెలిపారు. అధికారులు ఈ సమీక్షలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్ కు వివరించారు. ఈ సమావేశంలో క్షేత్ర స్థాయి హార్టికల్చర్ అధికారులు, ఏపీఎంఐపి సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *