విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ నవీన క్రీడా ఉత్స్తవ్ ఆద్వర్యం లో ఐకాన్ పబ్లిక్ స్కూల్ లో జరిగిన ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్ నందు రేటింగ్ సాధించిన గ్లోబల్ చెస్ అకాడమీ క్రీడా కారులకు అభినందనలు తెలుపుతూ ఈరోజు గ్లోబల్ చెస్ అకాడమీ లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రీడాకారులకు సత్కరించటం జరిగింది. మహీధర్ కు క్లాసిక్ లో 1517 రాపిడ్ లో 1540 బ్లిజ్ లో 1433, అర్షద్ బాబాకు రాపిడ్ లో 1515 బ్లీజ్ లో 1492, గీత శ్రీ కృష్ణ చైతన్యకు రాపిడ్ లో 1461, షేక్ నబీహకు రాపిడ్ లో 1458, దుల్కర్ అహ్మద్ ఖాన్ కు బ్లిజ్ లో 1473, చరణ్ సోమేశ్వర్ కు బ్లిజ్ లో 1505, అక్షర మాచర్ల కు 1437 స్టాండర్డ్ లో ఈ రోజు జరిగిన కార్యక్రమం లో ఇంకా మరిన్ని శిఖరాలకు చేరుకోవాలని గ్లోబల్ చెస్ అకాడమీ లో అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న అతిధులుగా బాబు (ఆఫీసు సూపర్డెంట్), శివ రామకృష్ణ ( శానిటరీ ఇన్స్పెక్టర్ విజయవాడ), ఆంజనేయులు గారు( పెన్నా వాటర్ ట్యాంక్ మార్కెటింగ్ హెడ్), చెస్ కోచ్ షేక్ ఖాసీం, అకాడమీ అధ్యక్షులు కే.రాజేంద్ర పాల్గొని అభినందించారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …