-లాంఛనంగా ప్రారంభమైన సంజా ఉత్సవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలని నినాదంతో సంజా ఉత్సవాన్ని నిర్వహించాము అన్నారు మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం మ్యారీస్ స్టెల్లా కాలేజ్ ఇండోర్ స్టేడియం నందు సంజా ఉత్సవ్ – ఎస్ హెచ్ జి మేళ 2024 ను లాంఛనంగా మెప్మా డైరెక్టర్ తేజ భరత్ అడిషనల్ కమిషనర్ జనరల్ విజయవాడ నగరపాలక సంస్థ డాక్టర్ డి చంద్రశేఖర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ నేషనల్ అర్బన్ లాగ్లీ హుడ్ మిషన్ 2.0 లో భాగంగా, పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రతి కుటుంబంలో ఒక వ్యాపార ఉండాలని ఉద్దేశంతో సంధ్య ఉత్సవ పేరుతో ఇటువంటి మేళ ఏర్పాటు చేశారని తెలిపారు. 28 లక్షల స్వయం సహాయక బృందాలు అందులో 11 లక్షల మంది జీవనోపాధి కార్యకలాపాలు చేస్తున్నారని, అందులో ఆరు లక్షల మంది వ్యాపారవేత్తలు ఉండగా, ఐదు లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. అక్కడ వచ్చిన వారందరికీ ప్రభుత్వ పథకాలైన స్వనిదధి, విశ్వకర్మ యోజన, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఇండివిజువల్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్, Shg బ్యాంక్ లింకేజ్, ప్రధానమంత్రి ముద్ర లోన్ల గురించి తెలిపారు. ప్రతి ఒక్కరూ నిరంతర ఆదాయం సంపాదించే విధంగా అడుగులు వేయాలని అన్నారు.
ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా నేషనల్ లవ్లీ హుడ్ మిషన్ 2.0 స్కీం ద్వారా పేద మధ్యతరగతి వారికి ఆర్థిక అభివృద్ధి కల్పించాలని ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 26, 2024 నుండి డిసెంబర్ 30, 2024 వరకు జరిగే ఈ కార్యక్రమంలో స్వయం సహాయక బృందాలు 100కు పైగా స్టాల్స్ లలో వారు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శన మరియు అమ్మకం చేస్తున్నారని, ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్ని వయసుల వారికి ఆకర్షించే విధంగా కిడ్స్ ప్లే, ఫుడ్ కోర్ట్, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఉచిత ప్రవేశమైన ఈ మేళాలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విన్నవించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి, కార్పొరేటర్ దేవినేని అపర్ణ , ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి. వెంకటనారాయణ, టెక్నికల్ ఎక్స్ప్రెస్ ఫణి కుమార్, సుజాత, తదితరులు పాల్గొన్నారు.