విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐక్య కాపునాడు ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్బంగా విజయవాడ, గాంధీనగర్, ప్రెస్ క్లబ్ నందు గురువారం ఉదయం 11:30 గంటలకు కీ.శే. రంగా చిత్ర పటానికి కి సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వం విప్ బొండా ఉమా మహేశ్వర రావు ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు బేతు రామమోహనరావు, మేడా శ్రీనివాస్, లాము జైబాబు రంగా మిత్ర మండలి నాయకులు పెద్దలు పూలమాలలు వేసి ఘననివాళులర్పించటo జరిగింది.
ఈ కార్యక్రమం లో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ కాపు నాడు అభ్యర్థన మేరకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని గత ప్రభుత్వం లో రంగా జిల్లా కోసం నిరాహార దీక్ష చేశామని అప్పుడు నేను ఇచ్చిన హామీ మేరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తో త్వరలో రంగా జిల్లా తేవడానికి నా వంతు సీఎం దృష్టిలో పెట్టి సాధిస్తామని, రంగా వ్యక్తి కాదు శక్తి అని ఆనాడు సామాజిక సృహ తో కుల మతాలకు అతీతంగా సామజిక న్యాయం చేసి, ప్రతి సామాన్యులు కి అండగా ఉన్న మహా నాయకుడు ఆయన కు శిష్యుడు గా ఉన్న మాకు గర్వ కారణం అని రంగా స్ఫూర్తి తో చంద్రబాబు నాయుడు విజన్ తో పని చేస్తున్నానని కార్యకర్తలు కు అండగా ఉంటానని అన్నారు
ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు బేతు రామమోహనరావు మాట్లాడుతూ ఆనాడు రంగన్న ఈనాడు ఉమన్న అందరికి కుల మతాలకు అతీతంగా అందరికి అండగా ఉన్నారని రానున్న రోజులు లో మంత్రి గా చూడాలని అన్నారు, ఈ వర్ధంతి కార్యక్రమంలో మేడా శ్రీనివాస్, లాము జైబాబు, నెలిబండ్ల బాల, వన్నెంరెడ్డి రాధా కృష్ణ, చలమలశెట్టి శ్రీనివాస్, భూపతి మహేష్, మాలిన్ బాషా,మసాబత్తుల శ్రీనివాస్ , గిద్దా శ్రీను, వేల్పూరి, ఉమ్మడి శెట్టి కృష్ణ మూర్తి, పెద్దలు, రాధా రంగా మిత్ర మండలి నేతలు, రంగా అభిమానులు, బొండా అభిమానులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …