Breaking News

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయండి.. : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఈ నెల 20 వ తేదీ శుక్రవారం కృష్ణాజిల్లా పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొనను న్నారన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించటంలో భాగంగా రైతు సేవా కేంద్రం, సమీపంలోని వెంకటాద్రి ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రైస్ మిల్, అనంతరం గంగూరు గ్రామంలో రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను శాసనసభ్యులు బోడే ప్రసాద్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలసి రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయం, పంచాయతీరాజ్ ఆర్అండ్ బి, బుధవారం రైతు సేవా కేంద్రంలో అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రంలో రైతులకు అందుతున్న సదుపాయాలను, ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న వెంకటాద్రి రైస్ మిల్లులో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలిస్తారన్నారు. అనంతరం గంగూరు గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేసి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారుల ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే మార్గం లో రహదారులు గుంతలు లేకుండా సవ్యంగా ఉండేలా సరిచేయాలని, హెలీపాడ్ ఏర్పాట్లు చూడాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

ఏర్పాట్ల పరిశీలన, అనంతర సమావేశంలో జిల్లా ఎస్పీ గంగాధర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, రెవెన్యూ డివిజనల్ అధికారి షారోన్, డీఎస్ఓ పార్వతి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి, , పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ,తహసిల్దార్లు ఉన్నారు.

Check Also

ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం

-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *