తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వస్తున్నాయని, మన సత్యవేడు మండలంలోని శ్రీసిటీ నందు పలు పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని నేడు ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ముఖాముఖి చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకుని పలు అంశాలు వివరించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సత్యవేడు మండలం తొల్లడం, పెద్ద ఈటిపాకం, ఇరగుళం, చిన్న ఈటిపాకం గ్రామాల రైతులతో జిల్లా కలెక్టర్ జెసి శుభం బన్సల్ ఆర్డిఓ సూళ్లూరుపేట కిరణ్మయితో కలిసి మాట్లాడుతూ సత్యవేడు మండలంలోని సదరు గ్రామాలలోని సుమారు 55.66 ఎకరాల భూసేకరణ ఏపీఐఐసి కొరకు డిసెంబర్ 15న భూసేకరణ ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని అందులో సుమారు 40 ఎకరాలు పట్టా భూమి ఉందని ఆ మేరకు రైతులతో ఎకరాకు చెల్లించాల్సిన నష్టపరిహారం రేటు పై కలెక్టర్ ,జెసి చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకుని వివరించారు. మరొక సారి సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో సత్యవేడు మండల తాసిల్దార్ సుబ్రహ్మణ్యం సదరు గ్రామాల రైతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …